IML 2025: విజేతగా ఇండియా మాస్టర్స్

4
- Advertisement -

ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ విజేతగా ఇండియా మాస్టర్స్ నిలిచింది. సచిన్ సారథ్యంలో బరిలోకి దిగిన ఇండియా మాస్టర్స్ జట్టు.. ఫైనల్లో వెస్టిండీస్ మాస్టర్స్‌ని ఓడించి విజేతగా నిలిచింది. విండీస్ విధించిన 149 పరుగుల టార్గెట్‌ను ఇండియా మాస్టర్స్ 17.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కొల్పోయి 149 పరుగులు చేసి విజేతగా నిలిచింది.

అంబటి రాయుడు (75), సచిన్ టెండూల్కర్ (25) ,యువరాజ్ సింగ్ (13నాటౌట్), స్టువర్ట్ బిన్నీ (16నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు. ఇక ఈ మ్యాచ్‌లో సచిన్ ఆటతీరు అందరిని ఆకట్టుకుంది. ముఖ్యంగా అప్పర్ కట్‌ షాట్‌తో సిక్స్ కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్.. నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 148 పరుగులు చేసింది. డ్వేన్ స్మిత్ (45) పరుగులు చేశాడు.

Also Read:IPL 2025 : సన్‌రైజర్స్‌కు గుడ్‌న్యూస్

- Advertisement -