టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 దశలో భాగంగా భారత్ జట్టు ఇవాళ చెన్నైలో జింబాబ్వేతో కీలక మ్యాచ్ ఆడనుంది. సెమీఫైనల్ ఆశలను నిలబెట్టుకోవాలంటే ఈ మ్యాచ్‌లో భారత్ తప్పనిసరిగా విజయం సాధించాలి.
దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 76 పరుగుల భారీ తేడాతో ఓడిపోవడంతో సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని జట్టుకు గట్టి దెబ్బ తగిలింది. ఇక వెస్టిండీస్ జింబాబ్వేపై భారీ విజయం సాధించడంతో భారత్ మిగిలిన రెండు మ్యాచ్‌లను మంచి రన్‌రేట్‌తో గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
వాతావరణ వివరాల ప్రకారం చెన్నైలో గురువారం వర్షం పడే సూచనలు లేవు. ఆకాశం స్వచ్ఛంగా ఉండే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు 26–28 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండగా, గరిష్ఠంగా 32 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉంది. అయితే తేమ శాతం 70 శాతం దాటే అవకాశం ఉండడంతో చెపాక్ స్టేడియంలో డ్యూ (తేమ) ప్రభావం మ్యాచ్‌పై కీలక పాత్ర పోషించవచ్చు.
బ్యాటర్ రింకు సింగ్ తన తండ్రి అనారోగ్యం కారణంగా తాత్కాలికంగా జట్టును విడిచిపెట్టగా, బుధవారం సాయంత్రానికి తిరిగి జట్టులో చేరనున్నట్లు బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ తెలిపారు.
Also Read:Modi:ప్రధాని మోదీ అరుదైన ఘనత..

