Ind Vs WI:రాహుల్ హాఫ్ సెంచరీ

9
- Advertisement -

వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత బౌలర్లు అద్భుతంగా రాణించారు. తొలిరోజు ఆటముగియగా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 162 పరుగులకు ఆలౌట్ అయింది.

వెస్టిండీస్‌ బ్యాటర్లలో జాన్ క్యాంప్‌బెల్ 8, చంద్రపాల్ 0, అలిక్ అతనాజే 12, బ్రాండన్ కింగ్ 13, రాస్టన్ చేజ్ 24, షై హోప్ 26, జస్టిన్ గ్రీవ్స్ 32, ఖారీ పియెర్ 11, వారికాన్ 8, జోహాన్ లేన్ 1, జేడెన్ సీల్స్ 6 పరుగులు తీశారు.

అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. స్టార్ బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.

Also Read:రూ.150 కోట్ల క్లబ్‌లో ‘మిరాయ్’

- Advertisement -