భారత్ – విండీస్ నాలుగో టీ20..

32
- Advertisement -

వెస్టిండీస్‌తో ఇవాళ నాలుగో టీ20లో తలపడనుంది భారత్. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా విండీస్ 2-1తో ఆధిక్యంలో ఉండగా భారత్ ఇవాళ గెలిస్తేనే సిరీస్ సమం అవుతుంది. అమెరికాలోని ఫ్లోరిడాలో ఈ మ్యాచ్ జరగనుండగా పిచ్ బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ ఇప్పటివరకు 13 టీ20 మ్యాచులు జరగ్గా తొలుత బ్యాటింగ్ చేసిన జట్టే 11 సార్లు విజయం సాధించింది.

గత మ్యాచుతో టీ20ల్లో అరంగేట్రం చేసిన యశస్వి జైశ్వాల్.. ఈ మ్యాచులో సత్తాచాటాలని ఉవ్విళ్లూరుతున్నాడు. సూర్యకుమార్ ఫామ్‌లోకి రావడం కలిసొచ్చే అంశం. సిరీస్‌ ప్రారంభం నుంచి ఆకట్టుకుంటున్న తెలుగు కుర్రాడు తిలక్ వర్మ.. ఈ మ్యాచులో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాడు.

తుది జట్లు అంచనా:.

భారత్:

యశస్వి జైశ్వాల్, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), సంజూశాంసన్(వికెట్ కీపర్), కుల్‌దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్షదీప్ సింగ్, ముకేశ్ కుమార్/ఉమ్రాన్ మాలిక్

Also Read:విక్రమ్ సారాభాయ్..జీవిత చరిత్ర

వెస్టిండీస్:

బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్ జాన్సన్ ఛార్లెస్, నికోలస్ పూరన్(వికెట్ కీపర్), రోవ్‌మన్ పోవెల్(కెప్టెన్), షిమ్రాన్ హిట్ మెయర్, రొమారియో షెఫర్డ్, జేసన్ హోల్డర్/రోస్టన్ ఛేజ్, అకీల్ హుసేన్, అల్జారీ జోసెఫ్, ఒబే మెకాయ్

- Advertisement -