భారత్–దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న మల్టీఫార్మాట్ సిరీస్‌లో భాగంగా ఇవాళ విశాఖపట్నం వేదికగా మూడో ODI జరగనుంది. డిసెంబర్ 6న విశాఖపట్నంలోని డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో సిరీస్ తుది మ్యాచ్ జరగనుంది. ప్రస్తుతం సిరీస్ 1-1తో సమంగా ఉంది. రాంచీలో జరిగిన తొలి ODIలో భారత్ గెలవగా, రెండో ODIలో రాయపూర్‌లో ప్రోటియాస్ మంచి ప్రదర్శనతో విజయం సాధించారు.
మూడో మ్యాచ్ సిరీస్ డిసైడర్ అవ్వడంతో రెండు జట్లు కూడా తమ బెస్ట్ ప్లేయింగ్ XIతో బరిలోకి దిగే అవకాశముంది. రెండో మ్యాచ్‌లో భారత్ ఓడిపోయిన నేపథ్యంలో కొంతమంది ప్లేయర్ల మార్పులపై చర్చ నడుస్తోంది.
రెండో ODIలో పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ 85 పరుగులు ఇవ్వడంతో అతని స్థానంలో ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి వచ్చే అవకాశముంది.
టీం ఇండియా ప్లేయింగ్ XI అంచనా:
యశస్వీ జైస్వాల్
రోహిత్ శర్మ
విరాట్ కోహ్లీ
రుతురాజ్ గైక్వాడ్
వాషింగ్టన్ సుందర్
KL రాహుల్ (కెప్టెన్ & వికెట్ కీపర్)
రవీంద్ర జడేజా
నితీష్ కుమార్ రెడ్డి
హర్షిత్ రాణా
కుల్దీప్ యాదవ్
అర్షదీప్ సింగ్
Also Read:BB9:కళ్యాణ్‌పై నోరుజారిన భరణి!

