IND vs SA T20 :సమం చేస్తారా? సమర్పిస్తారా?

31
- Advertisement -

టీమిండియా సౌతాఫ్రికా మధ్య నేడు నిర్ణయాత్మక మ్యాచ్ జరగనుంది. మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దవగా రెండో మ్యాచ్ లో సఫారీ జట్టు విజయం సాధించింది. ఇక నేడు జరిగే మూడో మ్యాచ్ లో విజయం సాధించి సిరీస్ సొంతం చేసుకోవాలని దక్షిణాఫ్రికా పట్టుదలగా ఉంటే ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ సమం చేయాలని టీమిండియా భావిస్తోంది. ప్రస్తుతం టీమిండియా బ్యాటింగ్ లో బలంగానే ఉన్నప్పటికీ బౌలర్స్ దారాళంగా పరుగులు సమర్పిస్తుండడం ఆందోళన కలిగించే అంశం. అర్షదీప్, ముఖేష్ కుమార్ వంటి వారు గత మ్యాచ్ లో ఘోరంగా విఫలం అయ్యారు. ఈ మ్యాచ్ లో తిరిగి గడిన పడకపోతే సిరీస్ చేజారే అవకాశం లేకపోలేదు. .

ఇక బ్యాట్స్ మెన్స్ విషయానికొస్తే.. సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్ అద్బుతంగా రాణిస్తుండడం కలిసొచ్చే అంశం. వీరికి తోడు జైస్వాల్, గిల్, శ్రేయస్ అయ్యర్ వంటి వారు చెలరేగితే.. భారీ స్కోర్ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే దక్షిణాఫ్రికా ప్లేయర్స్ ను తక్కువగా అంచనా వేయడానికి లేదు. వారి సొంత గడ్డపై జరుగుతున్న మ్యాచ్ లు కావడంతో సఫారీలను ఎదుర్కోవడం కష్టమే. ఆ జట్టులో కూడా భీకరమైన బ్యాట్స్ మెన్స్, నిప్పులు చెరిగే బౌలర్స్ ఉన్నారు. ముఖ్యంగా బ్యాటింగ్ విభాగంలో మార్క్రమ్, హెండ్రిక్స్, బార్ట్మన్, మిల్లర్ వంటి భీకర బ్యాట్స్ మెన్స్ ఉన్నారు. అలాగే బౌలింగ్ లో షంసి, కేశవ మహారాజ్ వంటి వారు ఉన్నారు. మరి ఈ నిర్ణయాత్మక మ్యాచ్ లో ఏ జట్టు విజయం సాధిస్తుందో చూడాలి. ఇక టీ20 సిరీస్ తర్వాత మూడు వన్డే మ్యాచ్ లు, రెండు టెస్ట్ మ్యాచ్ లు ఈ రెండు జట్ల మధ్య జరగనున్నాయి.

Also Read:TTD:విద్యార్థులకు భగవద్గీత కంఠస్థం పోటీలు

- Advertisement -