SA vs IND:వామ్మో.. ఒకే రోజు 23 వికెట్లు!

27
- Advertisement -

భారత్ మరియు సౌతాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా మారింది. ముఖ్యంగా బౌలింగ్ విషయంలో ఇరు జట్లు చెలరేగి ఆడాయి. దాంతో టెస్ట్ క్రికెట్ లోనే కనీవినీ ఎరుగని రీతిలో ఏకంగా 23 వికెట్లు నమోదై అందరిని ఆశ్చర్య పరిచింది. మొదట సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో 23.2 ఓవర్లలోనే ఆలౌట్ గా నిలిచింది. ఆ జట్టు తరఫున కైల్ వెర్రియన్ ఒక్కడే 15 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచారు. మిగిలిన బ్యాట్స్ మెన్స్ అంతా కూడా వరుసగా పెవిలియన్ క్యూ కడుతూ వచ్చారు. టీమిండియా బౌలర్స్ లో మహ్మద్ సిరాజ్ ఏకంగా ఐదు వికెట్లు తీశాడు. ఇక ఆ తరువాత తొలి ఇన్నింగ్స్ లో భారత్ 34.5 ఓవర్లలో 153 పరుగుల వద్ద ముగించింది. భారత బ్యాట్స్ మెన్స్ లలో విరాట్ కోహ్లీ 46, రోహిత్ శర్మ 39 పరుగులు, గిల్ 36 పరుగులు చేశారు..

ఇక 153 పరుగుల వద్ద నాలుగు వికెట్లు కోల్పోయిన రోహిత్ సేన.. ఆ తర్వాత ఒక్క పరుగు కూడా చేయకుండా ఏకంగా 6 వికెట్లను కోల్పోయింది. సౌతాఫ్రికా బౌలర్స్ లలో ఎంగిడి, రబాడ, కిగీసో తల మూడు వికెట్లు తీశారు. ఇక సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్ లో మొదటి ఆట ముగిసే సరికి ఆ జట్టు మూడు వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. దాంతో ప్రస్తుతం భారత్ 36 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఆ విధంగా తొలిరోజు టెస్ట్ మ్యాచ్ లో ఏకంగా 23 వికెట్లు నమోదు అయ్యాయి. దీనిపై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ట్విట్టర్ లో స్పందిస్తూ.. ఒకే రోజులో 23 వికెట్లు నమోదు కావడం అసలు ఊహించలేదని, ఇది నిజంగా జరిగిందా అనిపిస్తుందని కామెంట్ చేశారు. మొత్తానికి రెండో టెస్ట్ లో పట్టు కోసం ఇరు జట్లు గట్టిగానే ప్రయత్నిస్తున్నాయి. మరి ఏ జట్టు పై చేయి సాధిస్తుందో చూడాలి.

https://x.com/sachin_rt/status/1742577775037563240?s=20

- Advertisement -