IND vs SA:టీమిండియాలో మార్పులు తప్పవా?

31
- Advertisement -

సౌతాఫ్రికాతో టూర్ లో భాగంగా ప్రస్తుతం ఆ దేశ జట్టుతో రోహిత్ సేన టెస్ట్ సిరీస్ ఆడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పూర్తయిన మొదటి టెస్ట్ లో భారత్ 32 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. దీంతో సఫారీ జట్టు 0-1 తేడాతో ముందంజలో ఉంది. ఇక రెండో టెస్ట్ మ్యాచ్ జనవరి 3న కేప్ టౌన్స్ లోని న్యూలాండ్స్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలని పట్టుదలగా ఉంది రోహిత్ సేన. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ రేస్ లో నిలవాలంటే ఈ టెస్ట్ సిరీస్ గెలవాల్సిన పరిస్థితి. దాంతో రెండో టెస్ట్ మ్యాచ్ టీమిండియా కు డూ ఆర్ డై లా మారింది. ఈ నేపథ్యంలో టీమిండియా జట్టు కూర్పులో ఏమైనా మార్పులు ఉండే అవకాశం ఉందా అంటే మార్పులు తప్పవని చెబుతున్నారు మాజీలు. .

జడేజా ఫిట్ గా ఉండే అశ్విన్ స్థానంలో జడ్డూ కు స్థానం కల్పించడం మంచిదని సునిల్ గవాస్కర్ ఇటీవల తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇంకా ప్రసిద్ద్ కృష్ణ స్థానంలో ముకేశ్ కుమార్ ఆడించడం బెటర్ అని కూడా చెప్పుకొచ్చారు. స్టార్ అల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ నెట్ ప్రాక్టీస్ లో భాగంగా గాయపడ్డాడు. దాంతో అతడు రెండో టెస్ట్ మ్యాచ్ ఆడే అవకాశాలు తక్కువే అంటున్నారు క్రీడా విశ్లేషకులు. అతడి స్థానంలో ఆవేశ్ ఖాన్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక పోతే ఇప్పటివరకు సౌతాఫ్రికాలో భారత్ ఒక్క టెస్ట్ సిరీస్ కూడా దక్కించుకోలేదు. ఈసారి మొదటి మ్యాచ్ ఓటమితో సిరీస్ చేజారింది. అయినప్పటికి కనీసం సిరీస్ ను డ్రాగా నైనా ముగించాలని టీమిండియా భావిస్తోంది. మరి రెండో టెస్ట్ లో గెలిచి 2024ను రోహిత్ సేన ఘనంగా ఆరంభిస్తుందేమో చూడాలి.

Also Read:శ్రీ‌రంగ‌నీతులు..టీజర్ డేట్ ఫిక్స్

- Advertisement -