వరల్డ్ కప్ లో భాగంగా నేడు టీమిండియా ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి. మద్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ లక్నోలోని అటల్ బిహారీ వాజ్ పాయ్ స్టేడియంలో జరగనుంది. ప్రస్తుతం టీమిండియా వరుస విజయాలతో దుకుపోతుంది. ఇప్పటివరకు ఐదు మ్యాచ్ లు ఆడిన టీమిండియా అయిదింట్లో విజయం సాధించి ప్రత్యర్థి జట్లకు పెను సవాల్ విసురుతోంది. బ్యాటింగ్ బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్నీ విభాగాల్లోనూ పటిష్టంగా రానిస్తూ సెమీస్ కు అత్యంత చేరువలో ఉంది. నేటి మ్యాచ్ లో ఇంగ్లండ్ పై విజయం సాధిస్తే సెమీస్ బెర్త్ కన్ఫర్మ్ అయినట్లే. ప్రస్తుతం ఇంగ్లండ్ వరుస ఓటములతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. .
డీపెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగినప్పటికి ఆశించిన స్థాయిలో రాణించలేక చతికిల పడుతోంది. ఈ మ్యాచ్ లో ఇంగ్లీష్ జట్టు ఓడిపోతే టోర్నీ నుంచి నిష్క్రమించినట్లే. ప్రస్తుతం టీమిండియా జోరు మీద ఉండడంతో రోహిత్ సేనను ఎదుర్కోవడం ఇంగ్లండ్ జట్టుకు అంతా తేలికైన విషయం కాదు. ప్రస్తుతం టీమిండియాలో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్.. మంచి ఫామ్ లో ఉన్నారు. బౌలర్స్ లలో షమి, సిరాజ్, బుమ్రా కూడా రాణిస్తున్నారు. మరి అద్భుత ఫామ్ లో ఉన్న టీమిండియా జోరు కు ఇంగ్లీష్ జట్టు బ్రేకులు వేస్తుందా లేదా అనేది చూడాలి. ఇక ఇప్పటివరకు టీమిండియా ఆడిన ఐదు మ్యాచ్ లలో ఒక్కో మ్యాచ్ కు ఒక్కో ప్లేయర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ అందుకున్నారు. కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రా, షమి.. ఒక్కొక్కరు అవార్డ్ అందుకొని టీం ఫర్ఫామెన్స్ ను చాటి చెబుతున్నారు. మరి నేడు జరిగే మ్యాచ్ లో ఎవరు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలుస్తారో చూడాలి.
Also Read:Bigg Boss 7 Telugu:ఒక్కొక్కరికి క్లాస్ పీకిన నాగ్