క్రికెట్…ఏ క్షణంలో ఏమైనా జరగొచ్చు. గెలుస్తుంది అనుకున్న జట్టు ఓడోచ్చు అలాగే ఓడుతుంది అన్న జట్టు గెలువొచ్చు. దీనికి సరిగ్గా ఉదాహరణే భారత్ -ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదో టెస్టు. తొలి మూడు రోజులు భారత్ పై చేయి సాధించడంతో ఇక గెలుపు లాంఛనమే అనుకున్నారు అంతా కానీ నాలుగో రోజు ఒక్కసారిగా సీన్ మారిపోయింది. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ రాణించడంతో మ్యాచ్ మొత్తం వన్‌సైడ్‌గా మారిపోయింది.
378 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 259/3 పరుగులతో పటిష్ట స్థితిలో నిలిచి విజయానికి 119 పరుగుల దూరంలో నిలిచింది. క్రీజులో రూట్ (76 బ్యాటింగ్), బెయిర్‌స్టో (72 బ్యాటింగ్) ఉన్నారు. ఓపెనర్లు లీస్ (56), క్రాలే (46) శుభారంభం అందించారు.
ఇక అంతకుముందు భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 245 పరుగులకు ఆలౌటైంది. పంత్ (57) రాణించాడు. స్టోక్స్‌కు నాలుగు, బ్రాడ్.. పాట్స్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. విదేశీ గడ్డపై ఓ టెస్టు మ్యాచ్‌లో సెంచరీ, అర్ధసెంచరీ సాధించిన తొలి భారత వికెట్ కీపర్‌గా పంత్ నిలిచాడు. అలాగే ఇంగ్లండ్‌లో జరిగిన టెస్టులో ఎక్కువ పరుగులు (203) చేసిన కీపర్‌గా క్లైడ్ వాల్‌కాట్ రికార్డు (1950లో 172)ను అధిగమించాడు.