- Advertisement -
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో భారత్ పట్టు బిగించింది. మూడో రోజైన ఆదివారం రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన టీమిండియా ఆట ముగిసేసరికి 125/3 స్కోరు చేసింది. పుజార (50 బ్యాటింగ్), రిషభ్ పంత్ (30 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. కోహ్లీ (20), హనుమ విహారి (11), శుభ్‌మన్ గిల్ (4) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు.
తొలి ఇన్నింగ్స్ 132 పరుగుల ఆధిక్యంతో కలిపి మొత్తంగా 257 పరుగుల ఆధిక్యంలో ఉంది. దీంతో భారత్ ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచనుంది. ఇక తొలి ఇన్నింగ్స్‌ను కొసాగించిన ఇంగ్లండ్ 284 పరుగులకు ఆలౌటైంది. సూపర్ ఫామ్‌లో ఉన్న జానీ బెయిర్‌స్టో (140 బంతుల్లో 106) శతకంతోపాటు.. స్టోక్స్ (25), బిల్లింగ్స్ (36)తో కలసి విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పాడు. సిరాజ్ 4, బుమ్రా 3, షమి 2 వికెట్లు పడగొట్టారు.
- Advertisement -