రెండో టెస్ట్.. మార్పులు తప్పవా?

42
- Advertisement -

టీమిండియా ఇంగ్లాండ్ జట్ల మద్య నేటి నుంచి విశాఖ వేదికగా రెండో టెస్ట్ ప్రారంభం కానుంది. మొదటి టెస్ట్ లో ఓటమి చవిచూసిన టీమిండియా రెండో టెస్టులో విజయం సాధించాలని పట్టుదలగా ఉంది. అటు ఇంగ్లీష్ జట్టు కూడా మొదటి టెస్ట్ లో గెలిచిన ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనుంది. ఈ నేపథ్యంలో రెండో టెస్ట్ లో భాగంగా టీమిండియాలో భారీగా మార్పులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ప్రధాన ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, కే‌ఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమి వంటి ఆటగాళ్లు జట్టుకు దూరమవడంతో వారి స్థానాలను భర్తీ చేసేందుకు కుర్రాళ్ళకు అవకాశం ఇవ్వనుంది బీసీసీఐ. ఈ టెస్ట్ లో యువ ఆటగాళ్లు సర్ఫరాజ్ ఖాన్, రజత్ పటీదార్, వాషింగ్టన్ సుందర్ వంటి వారు బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. .

అయితే ఇంగ్లాండ్ జట్టును ఇబ్బంది పెట్టడంలో స్పిన్నర్లు ముఖ్య పాత్ర పోషిస్తారు. ఆ దిశగా చూస్తే నలుగురు స్పిన్నర్లతో రోహిత్ సేన బరిలోకి దిగే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలా చూస్తే సర్ఫరాజ్ ఖాన్ ను బెంచ్ కే పరిమితం చేసి వాషింగ్టన్ సుందర్ కు కచ్చితంగా చోటు దగ్గనుందని అంచనా. ఇక విశాఖలో భారత్ రికార్డ్స్ ను పరిశీలిస్తే ఇక్కడ టీమిండియా తిరుగులేని ఆధిపత్యం కనబరుస్తూ వచ్చింది. 2016లో ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో 246 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక సౌతాఫ్రికాతో 2019 లో జరిగిన టెస్ట్ సిరీస్ లో కూడా భారత్ 203 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఓవరాల్ గా చూసిన టీమిండియాకు వైజాగ్ బాగా కలిసొచ్చిన ప్లేస్. దీంతో రెండో టెస్ట్ లో టీమిండియా ఆదిపత్యం ప్రదర్శిస్తుందా అనేది చూడాలి.

తుది జట్టు అంచనా : రోహిత్ శర్మ, జైస్వాల్, రజత్ పాటిదార్, గిల్, శ్రేయస్ అయ్యర్, కేఎస్ భరత్, వాషింగ్టన్ సుందర్, అశ్విన్, అక్షర్ పటేల్, బుమ్రా, కుల్దీప్.

Also Read:KCR:తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యం

- Advertisement -