భారత్‌ను చిత్తుచేసిన ఇంగ్లాండ్…

223
india
- Advertisement -

పుణె వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత్‌ను చిత్తుచేసింది ఇంగ్లాండ్. తొలి వన్డే ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. భారీ టార్గెట్ అయినా అలవోకగా చేధించింది. బెయిర్ స్టో,స్టోక్స్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో సునామీ సృష్టించారు. ఫోర్లు,సిక్సర్లతో భారత బౌలర్లపై విరుచుకపడ్డారు. వీరి ధాటికి 337 పరుగుల లక్ష్యాన్ని 43.4 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కొల్పోయి చేధించింది.

బెయిర్ స్టో 124 పరుగులతో చెలరేగగా బెన్ స్టోక్స్ కేవలం 52 బంతుల్లో 4 ఫోర్లు, 10 సిక్సర్లతో విరిచుకుపడి 99 పరుగులు చేసి తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కొల్పోయాడు. చివర్లో లియామ్ లివింగ్ స్టోన్ 27, డేవిడ్ మలాన్ 16 పరుగులు చేసిన ఇంగ్లండ్ జట్టుకు విజయాన్ని అందించారు.

మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 108, కెప్టెన్ విరాట్ కోహ్లి 66, రిషభ్ పంత్ 77, హార్దిక్ పాండ్యా 35 రాణించడంతో భారీ స్కోర్ చేసింది కోహ్లీసేన. దీంతో మూడు వన్డేల సిరీస్.. ప్రస్తుతం 1-1తో సమం కాగా.. మరో వన్డే మిగిలి ఉంది.

- Advertisement -