లీడ్స్ వేదికగా భారత్-ఇంగ్లండ్ 1st టెస్ట్

5
- Advertisement -

నేటి నుంచి భారత్-ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. ఇంగ్లండ్ తో 5 టెస్టులు ఆడతుంది టీమిండియా. లీడ్స్ వేదికగా మధ్యాహ్నం 3.30కి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌ను సోనీ స్పోర్ట్స్‌ టీవీలో లైవ్ కవరేజ్ ప్రసారం చేయనుండగా, జియో హాట్‌స్టార్ డిజిటల్ భాగస్వామిగా ఉంది.

శుభ్‌మన్‌ గిల్ తొలిసారి టెస్ట్ కెప్టెన్సీ చేపడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. సీనియర్ ఆటగాళ్లైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్ లు రిటైర్ అయిన తర్వాత గిల్ బాధ్యతలు చేపట్టారు.25 ఏళ్ల వయసులో గిల్… భారత టెస్ట్ జట్టుకు పూర్తిస్థాయి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. జట్టును పునర్నిర్మించడమే కాకుండా, గత కెప్టెన్లు నెలకొల్పిన ఉన్నత ప్రమాణాలను కొనసాగించాల్సిన బాధ్యత ఆయనపై ఉంది.

ఇప్పటి వరకు 32 టెస్టులు ఆడారు గిల్. రిషబ్ పంత్ వైస్ కెప్టెన్‌గా కాగా టాప్ ఆర్డర్‌లో కేఎల్ రాహుల్ మరియు యశస్వి జైస్వాల్ కీలకంగా మారనున్నారు. పేస్ బౌలింగ్ బాధ్యతను జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ క్రిష్ణ, శార్దూల్ ఠాకూర్, అర్షదీప్ సింగ్ మోయనున్నారు. ఈ మ్యాచ్‌ ద్వారా 2025-27 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సైకిల్ ప్రారంభమవుతుంది.

Also Read:‘కుబేర’ …డిఫరెంట్‌ మూవీ!

- Advertisement -