భారత్ లో జరుగుతున్న ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో ఇవాళ కీలక పోరు జరగనుంది. మొదటి రెండు మ్యాచ్ లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి విజయాలు నమోదు చేసిన టీమిండియా.. మూడో మ్యాచ్ లో కూడా విజయం సాధించి సిరీస్ సొంతం చేసుకోవాలని భావిస్తోంది. అటువైపు ఆస్ట్రేలియా ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలిచి సిరీస్ లో నిలవాలని పట్టుదలగా ఉంది. గౌహతిలో జరగనున్న ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. ప్రస్తుతం టీమిండియా మంచి దూకుడు మీద ఉంది. జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్ వంటి వాళ్ళు మంచి ఫామ్ లో ఉన్నారు. చివర్లో రింకూ సింగ్ మెరుపులు మెరిపిస్తున్నాడు.
ఇక బౌలింగ్ విభాగంలో రవి బిష్ణోయ్, అర్షదీప్, ప్రసిద్ద్ వంటి వారు రాణిస్తున్నప్పటికి ఇంకా మెరుగైన ప్రదర్శన చేయాల్సిన అవసరముంది. భారత్ టాపార్డర్ బాగా రాణిస్తున్నప్పటికి ఐదో స్థానంలో బరిలోకి దిగే తెలుగు తేజం తిలక్ వర్మ ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. ఇక ఈ మ్యాచ్ లో ఎలాగైనా అతడు ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు. ఎందుకంటే చివరి రెండు మ్యాచ్ లకు శ్రేయస్ అయ్యర్ జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. అందువల్ల ప్రస్తుతం ఫామ్ లో లేని తిలక్ వర్మపైనే వేటు పడిన ఆశ్చర్యం లేదు. ఇక అటువైపు ఆసీస్ కు ఈ మ్యాచ్ డూ ఆర్ డై ల మారింది. ఈ మ్యాచ్ లో ఓడిపోతే సిరీస్ టీమిండియా సొంతం అవుతుంది. దాంతో ఎలాగైనా ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ లో నిలవాలని చూస్తోంది. ప్రస్తుతం ఆసీస్ బ్యాట్స్ మెన్స్ లలో షార్ట్, ఇంగ్లీస్, స్టోయినిస్ వంటి వారు రాణిస్తున్నప్పటికి మ్యాక్స్ వెల్, స్టీవ్ స్మిత్ వంటి వారు స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తే ఆస్ట్రేలియాకు తిరుగుండదు. మరి ఈ కీలకమైన పోరులో ఏ జట్టు విజయం సాధిస్తుందో చూడాలి..
జట్ల అంచనా
టీమిండియా : యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, ప్రసిద్ద్ కృష్ణ, ముఖేష్ కుమార్.
ఆస్ట్రేలియా ; స్టీవ్ స్మిత్, షార్ట్, మాథ్యూ షార్ట్, జోష్ ఇంగ్లీస్, మార్కస్, స్టాయినిస్, టిమ్ డేవిడ్, ఆరోన్ హర్ధి, మాథ్యూ వేడ్, సీన్ అబాట్, నాథన్ ఎల్లిస్, జాసన్ బెహ్రండార్ఫ్ తన్వీర్ సంఘా.
Also Read:Skin: చర్మం పొడిబారుతోందా..ఇలా చేయండి!