IND vs AFG : ఓపెనర్ గా కోహ్లీ ?

27
- Advertisement -

ఈ ఏడాది జరిగే టీ20 వరల్డ్ కప్ కు ముందు టీమిండియా అఫ్గానిస్తాన్ తో మూడు టీ20 మ్యాచ్ లు ఆడనున్న సంగతి తెలిసిందే. రేపటి నుంచి మొహాలీ స్టేడియం లో మొదటి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే రెండు టీంలు తుది జట్టును కూడా ప్రకటించాయి. ఇక ఈ సిరీస్ లో విజయం సాధించి ఈ ఏడాది గ్రాండ్ గా శుభారంభం చేయాలని టీమిండియా భావిస్తోంది. ప్రస్తుతం జట్టులో నాణ్యమైన ఆటగాళ్లు చాలానే ఉన్నారు, ముఖ్యంగా యువ ఆటగాళ్లలో యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ.. వంటి వారు టీ20 లలో మెరుపులు మెరిపిస్తున్నారు. పైగా 2022 టీ20 వరల్డ్ కప్ తర్వాత స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ జట్టులోకి రీఎంట్రీ ఇస్తున్నారు. దాంతో ఎవరు ఏ స్థానంలో ఆడతారనే దానిపై ఆసక్తి నెలకొంది. సాధారణంగా రోహిత్ శర్మ ఓపెనర్ గా బరిలోకి దిగుతాడు. హీట్ మ్యాన్ తో పాటు ఓపెనర్ గా బరిలోకి దిగేందుకు ప్రస్తుతం ఇద్దరు గట్టిగా పోటీ పడుతున్నారు. .

వన్డేలలో రోహిత్ శర్మ తో పాటు ఓపెనర్ గా బరిలోకి దిగే శుబ్ మన్ గిల్ టీ20 లలో కూడా ఓపెనర్ గానే బరిలోకి దిగుతాడా అనేది చూడాలి. ఇక జైస్వాల్ కూడా ఓపెనర్ గా రాణిస్తున్నాడు. దూకుడైన ఆటతీరుతో స్కోర్ బోర్డ్ పరుగులు పెట్టిస్తున్నాడు. దాంతో అఫ్గానిస్తాన్ సిరీస్ లో జైస్వాల్ ఓపెనర్ గా బరిలోకి దించితే బెటర్ అని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇక మూడో స్థానంలో ఆడే కోహ్లీ స్థానంపై కూడా సందిగ్ధత కొనసాగుతోంది. టీ20 లలో మూడో స్థానంలో కంటే ఓపెనర్ గానే కోహ్లీ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తాడు. ఐపీఎల్ ల్లో ఆర్సీబీ తరపున ఓపెనర్ గానే మంచి ఫలితాలను రాబట్టాడు. దాంతో రోహిత్ తో పాటు కోహ్లీ ఓపెనర్ గా బరిలోకి దిగితే ఆ తర్వాత కుర్రాళ్ళైన జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, రింకూ సింగ్ అద్భుతంగా రాణించే అవకాశం ఉంది. మరి రోహిత్ తో పాటు ఓపెనర్ గా ఎవరు బరిలోకి దిగుతారో చూడాలి.

Also Read:శ్రీ రామ జన్మభూమి మందిర్ విశేషాలు..

- Advertisement -