టీ20 వరల్డ్ కప్ కు ముందు టీమిండియా అఫ్గానిస్తాన్ తో మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ ఆడనున్న సంగతి తెలిసిందే. ఈ నెల 11 నుంచి సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కు ఎంపికయ్యే ఆటగాళ్ల విషయంలో గత కొన్ని రోజులుగా కన్ఫ్యూజన్ నడుస్తోంది. ఎందుకంటే టీ20 వరల్డ్ కప్ కు ముందు జరుగుతున్నా చివరి అంతర్జాతీయ సిరీస్ కావడంతో జట్టు కూర్పు ఎలా ఉండబోతుందనే చర్చ జరుగుతూ వచ్చింది. మరి ముఖ్యంగా సీనియర్ ఆటగాళ్ళైన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లను ఎంపిక చేస్తారా లేదా యువ ఆటగాళ్ల వైపే మొగ్గు చూపుతారా సందేహాలు వ్యక్తమౌతు వచ్చాయి. .
ఇక ఎట్టకేలకు అఫ్గానిస్తాన్ తో జరిగే సిరీస్ కోసం తుది జట్టును ప్రకటించింది బీసీసీఐ. ఈ సిరీస్ తో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తిరిగి టీ20 లలోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. 2019 వరల్డ్ కప్ తర్వాత పూర్తిగా టీ20 లకు దూరమయ్యారు ఈ ఇద్దరు. ఐపీఎల్ మినహా ఇతర ఏ అంతర్జాతీయ టీ20లలో పాల్గొనలేదు. దాంతో రోహిత్, కోహ్లీ ఈ ఏడాది జరిగే టీ20 వరల్డ్ కప్ ఆడతారా లేదా అనే సందేహాలు వ్యక్తమౌతూ వచ్చాయి. ఎట్టకేలకు అఫ్గాన్ టూర్ కు ఎంపిక కావడంతో జూన్ లో జరిగే టీ20 వరల్డ్ కప్ కూడా ఆడడం దాదాపు ఖాయమే అని చెప్పాలి.
ఇకపోతే ఈ అఫ్గాన్ టూర్ లో కేఎల్ రాహుల్ ను ఎంపిక చేయలేదు. కేఎల్ రాహుల్ కూడా 2019 తరువాత ఏ అంతర్జాతీయ టీ20 ఆడలేదు. ఇక తాజాగా అఫ్గాన్ తో జరిగే సిరీస్ కు కూడా ఎంపిక చేయకపోవడంతో టీ20 వరల్డ్ కప్ లో అతడి చోటుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక టీ20లలో నెంబర్ వన్ బ్యాట్స్ మెన్ గా ఉన్న సూర్యకుమార్ యాదవ్ గాయం కారణంగా ఈ సిరీస్ కు దూరమయ్యాడు. జట్టులో ఎంతమంది ఉన్న అందరి చూపు మాత్రం రోహిత్, కోహ్లీ పైనే ఉంటుంది. మరి ఈ ఇద్దరు ఎలా రాణిస్తారో చూడాలి.
తుది జట్టు : రోహిత్ శర్మ ( కెప్టెన్ ), గిల్, జైస్వాల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ, సంజూ శాంసన్, శివం దూబే, సుందర్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్,కుల్దిప్ యాదవ్, అర్షదీప్ సింగ్, ఆవేశ్ ఖాన్, ముకేశ్ కుమార్.
Also Read:షుగర్ పేషెంట్లు పాలు తగవచ్చా ?