Inclisiran Injection: ఇంక్లిసిరాన్‌తో గుండెపోటుకు చెక్

16
- Advertisement -

గుండెపోటు ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా అందరిలో కామన్ అయిపోయింది. గుండెపోటు రావడానికి అనేక కారణాలున్నాయి. మనం తీసుకునే ఆహారం దగ్గరి నుండి, వ్యాయామం వరకు అన్ని జాగ్రత్తలను పాటిస్తే నిద్రలో గుండెపోటు ప్రమాదం నుండి బయటపడవచ్చు.గుండెపోటు రావడానికి కారణం అధిక కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్ స్థాయిలు అధికంగా పెరిగి గుండెపోటుకు గురయ్యే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. శరీరంలో చెడు కొవ్వు పెరిగిపోతే అనారోగ్య సమస్యలు తలెత్తి క్రమేపీ హార్ట్ ఎటాక్‌కు దారి తీయవచ్చు. అందుకే హై కొలెస్ట్రాల్​ను కంట్రోల్ చేసి.. గుండె సమస్యలను దూరం చేసుకోవాలని సూచిస్తున్నారు.

అయితే తాజాగా గుండెపోటు రాకుండా చేసే కొత్త ఇంజెక్షన్ వచ్చేసింది. ఈ ఇంజక్షన్ పేరు ఇంక్లిసిరాన్. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఈ ఇంజక్షన్‌కు అనుమతులు ఇవ్వడంతో భారత మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చేసింది. ఈ ఇంజక్షన్ ఇప్పటికే అమెరికా, యూకేలలో అనుమతులు లభించాయి.

ఆరు నెలలకోసారి ఈ ఇంజెక్షన్ తీసుకొంటే గుండెపోటు దరిచేరదని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ప్లాస్మాలో తక్కువ సాంద్రత గల ఎల్‌డీఎల్‌ను ఇది నియంత్రిస్తుందని తెలిపారు. తద్వారా గుండెపోటు రాకుండా చేస్తుందని పరిశోధనలు నిరూపించాయి. ఈ ఇంజెక్షన్ తీసుకున్న రోగుల్లో మంచి ఫలితాలు కన్పించినట్టుగా ఈ నివేదిక తెలిపింది.

ఇంక్లిసిరాన్ … శరీరంలోని పీసీఎస్ కె-9 కు వ్యతిరేకంగా పనిచేస్తుంది. తద్వారా చెడు కొలెస్ట్రాల్ తయారీకి అడ్డుకట్ట వేస్తోంది. చెడు కొలెస్ట్రాల్ తయారీని నిలిపివేయడంలో ఈ ఇంజెక్షన్ అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తోందని క్లినికల్ ట్రయల్స్ లో తేలింది. దీంతో యూకే నేషనల్ హెల్త్ సర్వీసెస్ కూడా ఈ డ్రగ్ వినియోగానికి పచ్చజెండా ఊపింది.

గమనిక: ఈ కథనం అవగాహన కోసం మాత్రమే

Also Read:

 

- Advertisement -