ప్లాస్టిక్ ని నియంత్రిద్దాం పర్యావరణాన్ని కాపాడుకుందాం అని పిలుపునిచ్చారు బిగ్ బాస్ ఫెమ్, నటి ఇనాయ సుల్తానా. ఇవాళ బేగంపేట్ ట్రాఫిక్ సిగ్నల్ పరిధిలో రాజ్యసభ సభ్యులు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫౌండర్ జోగినపల్లి సంతోష్ కుమార్ గారి పిలుపు మేరకు ఇనాయ సుల్తానా ప్లాస్టిక్ వాడకాలను నియంత్రించే దిశగా అవగాహన సదస్సును ఏర్పాటు చెయ్యడం జరిగింది.
ప్లాస్టిక్ కి బదులు అందరు జూట్ బ్యాగ్స్ లేదా పేపర్ బ్యాగ్స్ వాడాలని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ జూట్ బ్యాగ్స్ మరియు పేపర్ బ్యాగ్స్ ని పంచి అందరిలో ఒక అవగాహనని కల్పించే దిశగా పని చేస్తున్నారు అన్నారు. పర్యావరణాన్ని కాపాడుకోవలసిన భాద్యత మన మీద ఎంతయినా ఉందని అన్నారు. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారి మొక్కలు నాటే కార్యక్రమం కానీ ప్లాస్టిక్ ని నియంత్రించే విధంగా చేపట్టే కార్యక్రమాలు రేపటి తరాలకు ఎంతో ఉపయోగకరము అన్నారు.ఇంతటి గొప్ప కార్యక్రమాలలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.
Also Read:బాలయ్య టీడీపీ పరువు తీస్తారా ? నిలబెడతారా?