హిందువులు ఎన్నో ఎళ్ల నుంచి ఎదురుచూస్తున్న అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది. ఫిబ్రవరి 21వ తేదీ నుంచి రామాలయ నిర్మాణం మొదలువుతుందని ఇవాళ పరమ ధర్మ సంసద్ తెలిపింది. కుంభమేళా సందర్భంగా బుధవారం ఇక్కడ సమావేశమైన సాధు సంతులు ఈ నిర్ణయం తీసుకున్నారు.స్వామి స్వరూపానంద సరస్వతి ఆధ్వర్యంలో సమావేశమైన 500 మందిసాధు సంతులు ఈ తీర్మానం చేశారు.
అయోధ్య రామ మందిర నిర్మాణంలో సుప్రీం కోర్టు తీర్పును గౌరవిస్తామని ధర్మ సంసద్ పేర్కొన్నది. నాలుగు రాళ్లను తీసుకుని శంకుస్థాపన కోసం అయోధ్యకు వెళ్తామని ధర్మ సంసద్ సభ్యులు తెలిపారు. అయోధ్యలో ఉన్న 67 ఎకరాల భూమిని రామ జన్మభూమి న్యాస్‌కు అప్పగించాలని ఇటివలే సుప్రీంను కేంద్రం కోరిన విషయం తెలిసిందే.ఫిబ్రవరి 21న రామ మందిర నిర్మాణాన్ని సాధు సంతులు ఎలా ప్రారంభిస్తారనేది ఆసక్తిగా మారింది.