జూన్‌లోనే వరుణుడు కరుణిస్తాడు..

248
Monsoon rains
- Advertisement -

ఈ సంవత్సరం (2019) జూన్‌లోనే వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అంచనాలను విడుదల చేసింది. ఈ సారి 96 శాతం సాధారణ వర్షపాతం నమోదు అవుతుందని ఐఎండీ అంచనా వేసింది. ఇక రైతులకు ఖరీఫ్ సీజన్ ఉపయోగకరంగా ఉంటుందని, దేశంలో నైరుతి రుతుపవనాల వల్ల జూన్ నుంచి సెప్టెంబర్ వరకు సాధారణ ‌వర్షపాతం‌‌ నమోదవుతుందని పేర్కొంది.

వచ్చే వర్షాకాలం పంటలకు ఎలాంటి ఇబ్బందులు ఉండదని ఎల్‌నినో ప్రభావం భారత్‌పై అంతగా చూపదని వాతావరణ శాఖ పేర్కొంది. జూన్ మొదటి వారంలో వర్షపాతంపై రెండవ విడత అంచనాలను విడుదల చేస్తామని వెల్లడించింది. ఈ ఏడాది నుంచి ఉరుములు, పిడుగుపాటు హెచ్చరికల వ్యవస్థలను ప్రారంభిస్తామని ఐఎండీ డైరెక్టర్‌ జనరల్ కేజే రమేశ్ తెలిపారు.

- Advertisement -