అప్పుడు ఆఫ్రిది…ఇప్పుడు ఇమామ్‌..!

444
imam
- Advertisement -

అమ్మాయిలను మోసం చేసిన ఆరోపణలను ఎదుర్కొంటున్నారు పాక్ స్టార్ క్రికెటర్ ఇమామ్ ఉల్ హక్‌. గతంలో పాక్ డాషింగ్ బ్యాట్స్‌మెన్‌ ఆఫ్రిదిపై ఇలాంటి ఆరోపణలే రాగా తాజాగా తన స్టార్ డమ్‌ని ఉపయోగించుకుని అనేక మంది యువతులని ఇమామ్ మెసాం చేశాడనే వార్తలు వెలువడుతున్నాయి. ఈ మేరకు పాక్ మీడియా కథనాలను ప్రచురించింది.

ఇమామ్‌ ఉల్‌ హక్‌ తన స్టార్‌డమ్‌ని ఉపయోగించి అనేకమంది యువతుల్ని మోసం చేశాడని తెలుస్తోంది. తమని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ప్రేమ పేరుతో వంచించాడని, వారితో శారీరక సంబంధాలు కూడా కొనసాగించాడని పేర్కొన్నాయి. ఇందుకుసంబంధించి ఆ యువతులతో ఇమామ్ కొనసాగించిన ఛాటింగ్ విశేషాలు,స్క్రీన్ షాట్లు వెలుగులోకి వచ్చాయి.

గత ఐదారు నెలల్లోనే ఇవన్నీ జరిగాయని, ఇటీవల జరిగిన ప్రపంచకప్‌ సమయంలోనూ కొనసాగించాడని పేర్కొన్నాయి. ప్రపంచకప్‌లో ఇమామ్‌ మంచి ప్రదర్శన చేయలేదనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో పాక్ క్రికెట్ బోర్డు ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి.

- Advertisement -