KTR పై అక్రమ కేసులు, అడ్డగోలుగా అప్పులు, రైతు భరోసా, రైతుబందు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పై మండిపడ్డారు మాజీమంత్రి జగదీష్ రెడ్డి. KTR పైన పెట్టింది దేశంలోనే చెత్త కేసు అన్నారు. అందులో ఎక్కడా అవినీతి కనబడలేదు.. చోటే భాయ్.. బడే భాయ్ కలిసి ఆడుతున్న నాటకాలు.. మోడీ సహకారంతోనే రేవంత్ కేసులు పెడుతున్నారు అన్నారు.
అక్రమ కేసులు పెడితే చివరకు రేవంత్ నేరస్థుడైతాడు.. ఫాల్స్ కేసులు పెడితే నష్టపోయేది మీరే.. రైతు భరోసా పై ప్రశ్నిస్తారనే KTR పై కేసులతో పక్కదారి పట్టిస్తున్నారు అన్నారు. వంద శాతం రైతు బంధు ఇస్తే ఆ లెక్కలు బయటపెట్టండి..రైతు భరోసా ఎగ్గొట్టడానికే కేసులను ముందుకు తెస్తున్నారు అన్నారు.ఎన్నికల ముందు హామీ ఇచ్చినప్పుడు ఏ కండీషన్లు పెట్టలేదు ఇప్పుడు అన్ని కొర్రీలు పెడుతున్నారు.. పూర్తి స్థాయిలో రైతు బంధు ఇవ్వలే అన్ని లెక్కలు బయటకు తీసి నిలదీస్తాం అన్నారు.
కేసులకు బయపడేది లేదు..హామీ ఇచ్చి మోసం చేస్తున్న వారి భరతం పట్టాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. అడ్డగోలుగా అప్పులు చేసి ఇచ్చిన హామీలు అమలు చేయక జేబులు నింపుకుంటున్నారు.. మేము చేసిన అప్పులకు ఆస్తులు కనపడుతుంటే కాంగ్రెస్ చేసిన అప్పులు ఎక్కడికి పోతున్నాయి అన్నారు. కేసిఆర్ తెచ్చిన అప్పుకు ఆస్థి కనబడుతుంది..రేవంత్ ప్రభుత్వం చేసిన 1.28 లక్షల కోట్ల అప్పులతో ఏం చేశారో చెప్పగలరా అని ప్రశ్నించారు.
Also Read:శబరిమలకు పోటెత్తిన భక్తులు..
ఒక్క అభివృద్ధి, సంక్షేమానికన్నా వినియోగించిండ్రా.. అడ్డగోలుగా అప్పులు చేసి ఢిల్లీ ఏఐసీసీ కి కప్పం కట్టి కాంగ్రెస్ ఎన్నికల కోసం వాడుకుంటున్నారు.. ప్రమాణ పత్రాలు, కండీషన్లు పెట్టకుండా రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులకు షరతులు దుర్మార్గమైన చర్య..రైతు భరోసా ఎగ్గొట్టెందుకే అనవసర చర్చలు..వరంగల్ డిక్లరేషన్ లో ఎంలాంటి కండిషన్లు చెప్పలే అన్నారు. విడతల వారీగా మాఫీలంటూ.. లెక్కలల్లో మార్పు చేసిన పాపం కాంగ్రెస్ ది అన్నారు.