Ileana:ప్రెగ్నెన్సీ ఎంజాయ్ చేస్తున్నా!

57
- Advertisement -

దేవదాస్ చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది గోవా బ్యూటీ ఇలియానా. సన్నజాజి తీగ నడుముతో ఎంతోమంది యువకుల హృదయాలని దోచేసిన ఈ భామ తెలుగులో స్టార్ హీరోయిన్ గా వెలుగువెలిగింది. టాలీవుడ్ లో పలువురు స్టార్ హీరోలతో నటించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత బాలీవుడ్ చెక్కేసింది. కొంతకాలంగా సినిమాలకు దూరమైన అభిమానులకు సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటూ ఎంటర్‌టైన్ చేస్తోంది.బాలీవుడ్ లో నిలబడాలంటే అందాలను ప్రదర్శన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే ఫాలో అవుతోంది సుందరి.

ఇక కొద్దిరోజుల క్రితం పెళ్లి కాకుండానే తాను ప్రెగ్నెన్సీ అని అనౌన్స్ చేసి అందరికి షాక్ ఇచ్చింది. తాజాగా అభిమానులతో ఇన్‌స్టాగ్రామ్ లో ముచ్చటించిన ఇలియానా పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చింది. ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు బరువు పెరుగుతారని తెలిసిందే.

Also Read:మూడు రోజులు భారీ వర్షాలు..

ఇదే ప్రశ్నను అడిగారు ఓ నెటిజన్. ప్రెగ్నెన్సీ సమయంలో బరువు పెరుగుతున్నందుకు బాధపడుతున్నారా అని అడగ్గా మొదట్లో ఈ ప్రశ్న నన్ను బాధపెట్టింది. కానీ ప్రెగ్నెన్సీ టైంలో బరువు పెరగడం చాలా కామన్. కానీ అందరూ దీనిపైనే కామెంట్స్ చేస్తారు. దాంతో మనం బరువు పెరుగుతున్నామనే భావన క్రియేట్ చేస్తారు. గత కొన్ని నెలలుగా మారిన నా శరీరాకృతికి నేను సంతోషిస్తున్నాను. ప్రెగ్నెన్సీ సమయంలో ఇలాంటివి ఆలోంచించకూడదు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలి అని చెప్పింది.

Also Read:ఈ అద్బుతమైన ఆరోగ్య చిట్కాలు.. తెలుసా ?

- Advertisement -