ఒక్క తెలుగు ఛాన్స్ ప్లీజ్..

872
- Advertisement -

గోవా బ్యూటీ ఇలియానా తెలుగు తెరపై తిరుగులేని అందాలను వెదజల్లింది. పైగా ఈ మధ్య ఇలియానా అందాల సాలిడ్ బొమ్మగా మారిపోయింది. తాను సన్నగా ఉన్నప్పుడే తెలుగు మేకర్స్ పిలిచి మరీ అవకాశాలు ఇచ్చారు, మరీ సాలిడ్ గా ఉన్నప్పుడు ఎందుకు ఛాన్స్ లు ఇవ్వరు అనేది ఇలియానా అభిప్రాయం. పైగా ఇలియానా ఎక్స్ ఫోజింగ్ లో ఇవ్వని ఫోజు లేదు. చూపించని వేరియేషన్ లేదు. గ్లామరస్ క్యారెక్టర్స్ దగ్గర నుంచి ఐటమ్ గర్ల్ వరకూ.. ఇలా పాత్ర ఏదైనా అందులో ఇలియానా ఇప్పటికే ఒదిగిపోయింది. ఇంకా ఒదిగిపోగలదు. తనదైన ముద్ర వేయగలదు. అది ఇలియానా స్టైల్ కూడా. l

అయితే, ఇలియానాను టాలీవుడ్ మళ్లీ ఆదరిస్తొందా ?, అదే డౌటే ఇప్పుడు. తెలుగు సినీ ప్రపంచంలో ఎంతో కీర్తి ప్రతిష్టలతో పాటు కావాల్సినంత డబ్బు కూడా సంపాదించుకుని, ఆ తర్వాత హిందీ పరిశ్రమ పై మోజుతో తెలుగు తెరను ఇలియానా చిన్న చూపు చూసింది. ప్రస్తుతం నార్త్ ఇండస్ట్రీ సౌత్ ఇండస్ట్రీ గొప్పతనాన్ని గొప్పగా చెప్పుకుంటున్న తరుణంలో గానీ.. హీరోయిన్ ఇలియానా కి అసలు తత్త్వం బోధపడలేదు. అందుకే.. మళ్ళీ తెలుగు సినిమాల అవకాశాలు కోసం ఇలియానా వెంపర్లాడుతుంది.

హీరోయిన్ ఛాన్స్ ల కోసం ఇలియానా ప్రస్తుతం టాలీవుడ్ దర్శకుల వెంట పడుతుందట. తనకు పరిచయం ఉన్న త్రివిక్రమ్, వంశీ పైడిపల్లి, పూరి లాంటి డైరక్టర్లకు ఫోన్ చేసి ఒక్క ఛాన్స్ ఇవ్వమని ఇలియానా వేడుకుంటుందట. అయితే, సౌత్ సినిమాల్లో ప్రస్తుతం కొత్త హీరోయిన్లు ఎక్కువగా వస్తున్నారు. పైగా ఇప్పటికే రష్మిక, పూజా హెగ్డే లాంటి వాళ్లు తమ హవా చూపిస్తున్నారు. ఈ తరుణంలో ఇలియానా మళ్ళీ హీరోయిన్ గా కొనసాగడం కష్టమే.

ఇవి కూడా చదవండి..

- Advertisement -