నేను సూసైడ్ చేసుకోవాలనుకున్న కానీ.. ఇలియానా

156
Ileana D’cruz
- Advertisement -

గోవా బ్యూటీ ఇలియానా అందానికి యువతలో ఉండే క్రేజ్ గురించి చెప్పనవసరం లేదు. పోకిరి చిత్రంతో టాలీవుడ్‌లో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. ఒకప్పుడు సౌత్‌లో యువతకు కలల రాణిగా వెలుగు వెలిగింది ఇలియానా. ఎన్నో హిట్ చిత్రాల్లో ఈమె న‌టించి న‌టిగా త‌న‌కంటూ ఒక ప్ర‌త్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. టాలీవుడ్ లో కెరీర్ దూసుకుపోతున్న టైంలో ఇలియానా తీసుకున్న నిర్ణయాలే కెరీర్ కు శాపంలా మారాయి. బాలీవుడ్ ని దున్నేయాలని బయలుదేరడంతో చుక్కెదురు తప్పలేదు. బాలీవుడ్ లో ఇలియానా చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. దీనితో అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ రెండు చోట్లా ఆఫర్స్ కరువయ్యాయి.

అయితే ఈ అమ్మడు త‌న కెరీర్‌పై దృష్టి పెట్ట‌కుండా ల‌వ్‌.. రిలేష‌న్‌షిప్‌.. అంటూ దారి త‌ప్పింది. దీంతో ఆమె ఇప్పుడు కోలుకోలేని ప‌రిస్థితి ఏర్ప‌డింది. లవ్ ఎఫైర్, బ్రేకప్ లాంటి వ్యవహారాలు ఇలియానాని కుంగదీశాయి. గ‌తంలో ఆమె కెరీర్ పీక్ ద‌శ‌లో ఉన్న‌ప్పుడు ల‌వ్ కార‌ణంగా సినిమాల‌ను అంగీక‌రించకపోవడం ఆమె చేసిన పెద్ద పోరపాటు. అయితే ప్రేమాయణం అయినా స‌రిగ్గా జ‌రిగిందా.. అంటే.. అదీ లేదు. త‌న ప్రియుడికి బ్రేక‌ప్ చెప్పింది. దీంతో రెంటికీ చెడ్డ రేవ‌డి సామెత‌లా ఆమె జీవితం మారిపోయింది. అయితే ల‌వ్ బ్రేక‌ప్ అయినందున ఆమె కొంత కాలం పాటు అంద‌రికీ దూరంగా ఉంది. దీంతో ఆమె తీవ్ర‌మైన డిప్రెష‌న్‌లో ఉంద‌ని.. ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌నుకునే ఆలోచ‌న‌లు వ‌స్తున్నాయని.. వార్త‌లు ప్ర‌చారం అయ్యాయి. ఆ వార్తలపై ఇలియానా తాజాగా ఇంటర్వ్యూలో స్పందించింది.

తాను సూసైడ్ చేసుకోవాలని భావించిన మాట నిజమే. కానీ అది నా బాడీ షేప్స్, బాడీ షేమింగ్ వల్ల మాత్రం కాదు. కొన్ని ఊహించని పరిస్థితుల వల్ల డిప్రెషన్ లోకి వెళ్లా. దీనితో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు కూడా పుట్టాయి. కానీ మీడియాలో నా శరీరాకృతి వల్ల ఆత్మహత్య ఆలోచన చేసినట్లు రాశారు. అది చాలా బాధించింది. 12 ఏళ్ల వయసు లోనే నేను శరీరాకృతి విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. కాబట్టి అప్పటి నుంచే నా బాడీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నాను. కానీ ఎప్పుడూ ఆ అంశం వల్ల చనిపోవాలని అనుకోలేదు. ఇలా నాపై రాసిన ఆర్టికల్స్ వల్ల నా స్నేహితులు సందేశాలు పంపారు. అది నాకు చాలా చిరాకుగా అనిపించినట్లు ఇలియానా పేర్కొంది. దీంతో దాని వెనుక ఉన్న కార‌ణాల‌ను నెటిజ‌న్లు అన్వేషిస్తున్నారు. మ‌రి భ‌విష్య‌త్తులో అయినా ఇలియానా త‌న సూసైడ్ ఆలోచ‌న‌ల‌కు కార‌ణాలు ఏమిట‌నేది.. చెబుతుందా.. లేదా.. అన్న‌ది వేచి చూస్తే తెలుస్తుంది..!

- Advertisement -