ఇలియాన.. ఆ టైప్‌ కాదట…!

271
Ileana is NOt Happy with Movie Offers
- Advertisement -

దేవదాసు సినిమాతో టాలీవుడ్‌ కి పరిచయమైన ఇలియాన..తక్కువ కాలంలోనే టాప్‌ పొజిషన్‌ కి చేరుకుంది. అయితే ఆ టాప్‌ పొజిషన్‌ ని వదులుకొని బాలీవుడ్‌ కి చెక్కేసింది ఈ భామ.  బాలీవుడ్‌ కి వెళ్ళి బిజీగా ఉంటుందని చాలానే  ఊహించుకుంది. కానీ దానికి  భిన్నంగా ఆఫర్లు లేక  వెలవెలబోతోంది ఇల్లీ . కానీ ఆ విషయాన్ని మాత్రం బయటకు చెప్పట్లేదు.
Ileana is NOt Happy with Movie Offers
ఇక ఆఫర్లు లేకపోవడంతో ఇలియానకి తీరిక ఎక్కువగానే ఉంది. అయితే ఆ సమయంలోనే బాయ్‌ఫ్రెండ్‌తో సహజీవనం చేస్తోంది. అంతేకాదు ఫోటోగ్రాఫర్‌ అయిన అతగాడికి తన నగ్న దేహాన్ని కూడా ఫోటోలు తీసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. వాటిలో కొన్నిటిని ఫాన్స్‌తో కూడా షేర్‌ చేసుకుంటూ కనువిందు చేస్తోంది ఇలియాన. అయితే ఇల్లి ఇప్పుడు ఎలాంటి కథలు పడితే అలాంటివి చేయకూడదని డిసైడైపోయిందని సమాచారం.

ఇప్పటివరకూ ఇలియాన తన కెరియర్లో చేసినవన్నీ గ్లామర్‌ పాత్రలే.  ఆ విషయాన్ని మర్చిపోయి…  విలువల గురించి లెక్చర్లు ఇస్తోంది. తనకి అవకాశాలు తగ్గిపోయాయని చెప్పలేక ఇలా కథలు నచ్చడం లేదనే రొటీన్‌ స్టేట్‌మెంట్‌ ఇస్తోంది ఇల్లి.  అంతే కాకుండా తనకి అవకాశాలు ఇవ్వమని అడుక్కునే అలవాటు లేదని, ఆఫర్ల కోసం దేహీ అననని, వాళ్లకి తాను కరక్ట్‌ అనిపిస్తే ఆఫర్‌తో వాళ్లంతట వాళ్లే వస్తారని చెప్తోంది.  అంతేకాకుండా బిజీ కావడం కోసం క్యారెక్టర్‌ని చంపుకోలేనని కూడా ఇలియానా చెప్పుకొచ్చింది.

- Advertisement -