ఆ విషయంలో వెనక్కితగ్గని గోవా బ్యూటీ..

455
Ileana Demands Huge Remuneration For Ravi teja movie..
- Advertisement -

రామ్ హీరోగా ‘దేవదాసు’ చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి సన్నని నడుముతో కుర్రకారును ఓ రేంజులో ఆకట్టుకుంది గోవా బ్యూటీ ఇలియానా. టాలీవుడ్‌లో దాదాపు స్టార్ హీరోలందరితోనూ నటించి సూపర్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంది.  ఇక ఆ తర్వాత బాలీవుడ్‌ను నుంచి ఆఫర్లు రావడంతో టాలీవుడ్‌ను కాస్త దూరంపెట్టిన ఈ బ్యూటీ మళ్లీ తెలుగు చిత్ర పరిశ్రమలోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమైంది.

Ileana Demands Huge Remuneration For Ravi teja movie..

గతంలో టాలీవుడ్‌కి రీఎంట్రీ ఇవ్వాలని ప్రయత్నం చేసినా అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోయాయి. ఇప్పుడు రవితేజ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటోని’ సినిమాతో మాస్ మహారాజ్ తో మరోసారి జోడికట్టనుంది. ఇందులో రవితేజ త్రిపాత్రిభినయం  చేస్తుంటం విశేషం

ఇక ఈ సినిమా కోసం ఈ అమ్మడు రూ. 2 కోట్ల పారితోషికం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. దీనికి నిర్మాతలు కూడా అంగీకరించారట. గతంలో ఇలియానా రవితేజతో కిక్,ఖతర్నాక్, దేవుడు చేసిన మనుషులు వంటి సినిమాల్లో నటించి ఇప్సుడు రవితేజతో నాలుగో సినిమాకు రెడీ అయ్యింది.

- Advertisement -