ఫిజి…బ్రాండ్ అంబాసిడర్‌గా ఇలియానా

195
Ileana D’Cruz named Tourism Fiji brand ambassador
- Advertisement -

ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన గోవా బ్యూటీ ఇలియానా. తర్వాత బాలీవుడ్లో అడుగు పెట్టి సౌత్ సినిమాల వైపు కన్నెత్తయినా చూడటం లేదు. అమ్మడు నటించిన తొలి చిత్రం మంచి విజయం సాధించినప్పటీ…. తర్వాత సినిమాలన్నీ ప్లాపయ్యాయి. వరుస ప్లాపులతో ఇలియానాకు కూడా అవకాశాలు కూడా తగ్గిపోయాయి. చేతిలో పెద్దగా సినిమాలు లేక పోవడంతో… ఖాళీ సమయాన్ని తన బాయ్ ఫ్రెండుతో గడపటానికి కేటాయిస్తోంది. అంతేగాదు బాయ్‌ ఫ్రెండ్‌తో సన్నిహితంగా ఉన్న ఫోటోలతో పాటు ఎక్స్ ఫోజ్ చేస్తూ దిగిన ఫోటోలను ఇన్‌ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ అభిమానులను తన వైపు తిప్పుకుంటోంది.

తాజాగా ఈ బ్యూటీకి అరుదైన అవకాశం లభించింది. ప్రకృతి సోయగాలకు నిలయమైన ఫీజి దేశానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికైంది. బ్రాండ్ అంబాసిడర్‌ వార్త విన్న ఈ గోవా బ్యూటీ ఎగిరిగంతేస్తోంది. ఫీజీకి బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేయడం ఆనందంగా ఉందని ఇక్కడి వారి ప్రేమను మర్చిపోలేనని చెప్పుకొచ్చింది.

పీజిలో 38 శాతం ప్రజలు భారత సంతతికి చెందిన వారే. భారతీయ సంప్రదాయాలకు ఇక్కడి ప్రజలు పెద్దపీట వేస్తారు. ఇలియానాను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడంతో పర్యాటకుల సంఖ్య మరింతగా పెరుగుతుందని ఆ దేశ పర్యాటక శాఖమంత్రి తెలిపారు. గతంలో పరిణితీ చోప్రా ఆస్ట్రేలియా, సిదార్థ్‌ మల్హోత్రా న్యూజిల్యాండ్ తరఫున బ్రాండ్‌ అంబాసిడర్లుగా నియమితులు కాగా తాజాగా ఆ జాబితాలో ఇప్పుడు ఇలియానా కూడా చేరింది.

- Advertisement -