ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో గోవాబ్యూటీ ఇలియానా తన అందాలను బాగానే ఆరబోసింది. దేవదాసు సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన ఇలియాన..తక్కువ కాలంలోనే టాప్ పొజిషన్ కి చేరుకుంది. అయితే ఆ టాప్ పొజిషన్ ని వదులుకొని బాలీవుడ్ కి చెక్కేసింది ఈ భామ. బాలీవుడ్ కి వెళ్ళి బిజీగా ఉంటుందని చాలానే ఊహించుకుంది.
ఇమేజ్ పెరిగేకొద్ది ఎక్స్ పోజింగ్ విషయంలో ఆంక్షలు విధిస్తూ వచ్చింది. లిప్ లాక్, బోల్డ్ సీన్లలో నటించాలంటే భారీగా డబ్బులు డిమాండ్ చేసింది. ఇక బాలీవుడ్‌లో అడుగుపెట్టిన దగ్గరి నుంచి తన అందాలను విచ్చలవిడిగా ప్రదర్శించడమే కాక మ్యాగజైన్ ఫోటోషూట్స్ కోసం బికినీలో సైతం దర్శనమిచ్చింది. చేతిలో ఒక్క అజయ్ దేవగన్‌తో తప్ప ఈ బ్యూటీకి పెద్దగా సినిమాలు లేవు.
దీంతో ఇల్లీ బేబిపై రకరకాల రూమర్లు షికార్ చేస్తున్నాయి. అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఎంతకైన సిద్దమైందని ఇండస్ట్రీలో టాక్. అయితే, ఈ వార్తలను ఇలియానా కొట్టిపడేసింది. అవకాశాల కోసం తాను దిగజారి బతకనని తేల్చిచెప్పేసింది. ఛాన్సులు ఇవ్వాలని కోరుతూ తాను ఎవరి వెంటా పడనని… అందుకే తనకు సినిమాలు తగ్గాయని చెప్పుకొచ్చింది ఈ గోవా బ్యూటీ.
అంతేకాదు, ఏ సినిమా పడితే ఆ సినిమా చేస్తే తన ఇమేజ్ కూడా డ్యామేజ్ అవుతుందని ఇల్లీ తెలిపింది. ఇతర హీరోయిన్లు, తనకన్నా ఎక్కువ వయసున్న భామలు కూడా వరుస అవకాశాలతో దూసుకుపోతుంటే… ఇలియానాకు మాత్రం ఏడాదికి ఒక సినిమా రావడం కూడా కష్టమైపోతోంది. అయితే,తనకు సినిమా అవకాశాలు తగ్గిపోయిన విషయాన్ని కప్పిపుచ్చుకునేందుకే ఇలియానా ఇలాంటి కబుర్లు చెబుతోందంటూ బాలీవుడ్ జనాలు చెప్పుకుంటున్నారు.