రాజ్యసభకు ఇళయరాజా!

51
ilayaraja
- Advertisement -

ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా త్వరలోనే రాజ్యసభకు నామినేట్ కానున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీని అంబేద్కర్‌తో పోల్చి వార్తల్లో నిలిచిన ఇళయరాజాను బీజేపీ రాజ్యసభకు నామినేట్ చేయనుంది.

త్వరలోనే సుబ్రమణ్యస్వామి పదవీకాలం ముగియనుండగా ఆయన స్ధానంలో ఇళయరాజాకు అవకాశం కల్పించనున్నారు. ఇళయరాజాకు ఎంపీ పదవివస్తుందన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అయితే ఇళయరాజాకు ఎంపీ పదవిపై డీఎంకే తీవ్రంగా స్పందించింది. ఇళయరాజా ఆరెస్సెస్ ఏజెంట్‌గా అని అందుకే ఆయన్ని రాజ్యసభకు పంపుతున్నారని డీఎంకే నేతలు విమర్శలు గుప్పించారు.

- Advertisement -