ఇలయ దళపతి విజయ్ హరోగా నటించిన సర్కార్ సినిమా భారీ వసూళ్లను రాబడుతోంది. స్టార్ డైరెక్టర్ ఏఆర్. మురుగదాస్ ఈసినిమాకు దర్శకత్వం వహించిన సన్ నెట్ వర్స్ వారు నిర్మించారు. విజయ్ సరసన హీరోయిన్ గా కీర్తి సురేష్ నటించింది. అయితే ఈమూవీ విడుదలైన మొదటిరోజు నుంచే భారీ వసూళ్లను రాబడుతోంది.
అయితే ఈసినిమాలో కొన్ని సన్నివేశాలను తొలగించాలంటూ మూవీపై వివాదం జరిగినా కలెక్షన్లకు ఏమాత్రం ఆటంకం కలగలేదు. తెలుగు తమిళ్ లోనే కాకుండా ఓవర్సీస్ లోనూ ఈచిత్రం భారీ వసూళ్లను సొంతం చేసుకుంటోంది. విడుదలైన రెండు రోజుల్లోనే 100కోట్ల క్లబ్ లో చేరిన ఈమూవీ తాజాగా మరో రికార్డు క్రియేట్ చేసింది.
6రోజుల్లో ఈమూవీ 200కోట్ల గ్రాస్ ను రాబట్టింది. యూఎస్ ఏలో 6.62 కోట్లు .. యూకేలో 3.63 కోట్లు .. ఆస్ట్రేలియాలో 2.21కోట్లు .. న్యూజిలాండ్ 20.05 లక్షలు .. యూఏఈ/జిసీసీలో కలుపుకుని 5 రోజుల్లో ఈ సినిమా 15.66 కోట్లు రాబట్టినట్టు సమాచారం. విజయ్ మురుగదాస్ కాంబినేషన్ లో వచ్చిన మూడు సినిమాలో విజయం సాధించడం విశేషంగా చెప్పుకోవచ్చు.