తెలంగాణలో రూ.700కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఇండియన్ ఇమ్యూనోలాజికల్స్ లిమిటెడ్ సంస్థ ముందుకొచ్చింది. జంతువుల వ్యాక్సిన్ తయారీ కేంద్రంను హైదరాబాద్‌లోని జినోమ్ వ్యాలీలో వెటర్నరీ వ్యాక్సిన్ ఫెసిలిటీని ఏర్పాటు చేసేందుకు మంత్రి కేటీఆర్‌ను కోరారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ సమావేశమైన సంస్థ ఎండీ ఆనంద్‌కుమార్ ప్రకటించారు. దీంతో పాదాలు, నోటి ద్వారా పశువులకు వచ్చే వ్యాధులకు సంబంధించిన వ్యాక్సిన్ ఉత్పత్తిని రెట్టింపు జరిగి జంతువుల ప్రాణాలను కాపాడవచ్చు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… ఐఐఎల్ సంస్థ మరో కేంద్రం ఏర్పాటు నిర్ణయం సంతోషకరమన్నారు. లైఫ్ సైన్సెస్ రంగంలో హైదరాబాద్ జోరు కొనసాగుతోందని చెప్పారు. ఇప్పటికే గచ్చిబౌలిలో ఐఐఎల్‌కు ఓ వెటర్నరీ వ్యాక్సిన్ ప్లాంట్ ఉంది. ఇందులో ఏడాదికి 300మిలియన్ వ్యాక్సిన్ డోసులను ఆ సంస్థ ఉత్పత్తి చేస్తోంది. కొత్తగా జినోమ్ వ్యాలీలో ఏర్పాటు చేయనున్న తన తదుపరి యూనిట్‌లో ఏడాదికి మరో 300మిలియన్ యూనిట్ల వ్యాక్సిన్ ఉత్పత్తి చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ సంస్థ ద్వారా తెలంగాణలో ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారుగా 2000 మంది ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.