హైదరాబాద్ లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఐఐఎఫ్‌ఏ ఉత్సవం 2024’ యావత్ సినిమా ప్రపంచాన్ని తన వైపు తిప్పుకుంది.భారతీయ సినిమా సూపర్‌స్టార్, మెగాస్టార్ చిరంజీవికి ఐఐఎఫ్‌ఏ ఉత్సవం ‘ఔట్ట్ స్టాండింగ్ అచీవ్‌మెంట్ ఇన్ ఇండియా’గా ప్రత్యేక గౌరవాన్ని అందించింది.ప్రముఖ నటి సమంతా రూత్ ప్రభును భారతీయ సినిమాలో ప్రతిష్టాత్మక ’ఉమెన్ ఆఫ్ ది ఇయర్’తో సత్కరించబడుతోంది.‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ ఐఐఎఫ్‌ఏ ఉత్సవం 2024కి హాజరుకానున్నారు.ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతని అభిమానులు వేడుక జరుపుకోవడానికి ఉత్సాహంగా ఉన్నారు. అల్లు అర్జున్ తదుసరి ప్రతిష్టాత్మక సీక్వెల్ పుష్ప–2 అప్‌డేట్స్ కోసం ఆత్రంగా ఎదురు చూప్తున్నారు.
తెలుగు ఇండస్ట్రీలో ప్రత్యేకతగాంచిన సూపర్ స్టార్ తండ్రీ కొడుకుల ద్వయం నాగార్జున అక్కినేని–అఖిల్ అక్కినేని ఈ ఉత్సవంలో పాల్గొంటున్నారు.అంతర్జాతీయ స్థాయిలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విజువల్ స్పెక్టాకిల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ కేడీ–కాళిదాసు స్పెషల్ ట్రైలర్‌ను ఈ గ్లోబల్ వేదికపై ఆవిష్కరించనున్నారు.
–ప్రముఖ భారతీయ చలనచిత్ర నిర్మాతలు కే.ఎస్. రామారావు, డీ.సురేష్ బాబు, నవీన్ యెర్నేని వంటి ప్రముఖులు పాల్గొననున్నారు..ఫిల్మ్‌స్టార్స్…రానా దగ్గుబాటి, రాక్‌స్టార్ దేవీశ్రీ ప్రసాద్, తేజ సజ్జా, రాశి ఖన్నా, శ్రీలీల, విజయ్ రాఘవేంద్ర, పెర్లే మానే, ప్రగ్యా జైస్వాల్, మాలాశ్రీ రామన్న, ఆరాధనా రామ్, సుదేవ్ నాయర్, సిమ్రాన్ రిషి బగ్గా, రసూల్ పూకుట్టి, కుష్బూ, సాగర్ (ప్లయ్‌బ్యాక్ సింగర్ తెలుగు సినిమాలు), మంగ్లీ(ప్లేబ్యాక్ సింగర్ తెలుగు సినిమా), నితిన్, అక్షర హాసన్, తేజ ధర్మ, డి. సురేష్ బాబు, కె. ఎస్. రామారావు, అల్లు అరవింద్, శరత్ మరార్, సతీష్, నవదీప్ తదితర దక్షిణ భారత సినీ ప్రముఖులు హాజరయ్యారు.
16 జూలై 2024, హైదరాబాద్: సౌత్ ఇండియన్ సినిమా సాధించిన విజయోత్సవ సంబరాలను చేసుకుంటూ, దక్షిణాది గొప్పతనాన్ని హైలైట్ చేస్తూ తమిళం, తెలుగు, మలయాళం మరియు కన్నడ చిత్ర పరిశ్రమలు సంయుక్తంగా ఐఐఎఫ్‌ఏ ఉత్సవం 2024ను యూఏఈ –అబుదాబిలోని యాస్ ద్వీపంలో సెప్టెంబర్‌లో అంగరంగవైభవంగా జరపనుంది. యూఏఈ టోలరెన్స్ అండ్ ఎగ్జిస్టెన్స్ మంత్రి షేక్ నహ్యాన్ బిన్ ముబారక్ ఏఐ నహ్యాన్ సమక్షంలో, అబుదాబి మరియు మిరల్‌ల డిపార్ట్‌మెంట్ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజంతో భాగస్వామ్యంతో సౌత్ ఇండియన్ సినిమా సగర్వంగా తన ప్రశస్తిని చాటుకోనుంది. ఐఐఎఫ్‌ఏ ఉత్సవం యొక్క అంతర్జాతీయ వేడుకలు అత్యంత వైభవంగాæ అధికారిక భారతదేశంతో ప్రారంభమైనందున దాని అంచనాలు మరింత అపూర్వమైన స్థాయికి పెరిగాయి. ఇందులో భాగంగా మంగళవారం హైదరాబాద్‌లో ఐఐఎఫ్‌ఏ ఉత్సవం సంబంధించిన విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. దక్షిణ భారత సినిమా విజయాలు మరియు గౌరవాన్ని జరుపుకోవడానికి సిద్ధంగా ఉన్న రెండు రోజుల వేడుకకు తమిళం, తెలుగు, మలయాళం, మరియు కన్నడ చిత్ర పరిశ్రమలోని ప్రముఖ సినీ ప్రముఖులతో ఉత్కంఠతో సాగిన ఈ కార్యక్రమంలో ఆద్యాంతం ఆకట్టుకుంది. ఈ ఉత్సవంలో హోస్ట్‌లు, సదరన్ సినిమా పయనీర్స్, ఇండస్ట్రీ లీడర్‌లు, అంతర్జాతీయంగా ఆర్టిస్టులు, జాతీయ–అంతర్జాతీయ ప్రముఖులు, ముఖ్య మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. స్టార్స్ రానా దగ్గుబాటి, రాక్‌స్టార్ దేవీశ్రీ ప్రసాద్, తేజ సజ్జా, రాశి ఖన్నా, శ్రీలీల, విజయ్ రాఘవేంద్ర, పెర్లే మానే, ప్రగ్యా జైస్వాల్, మాలాశ్రీ రామన్న, ఆరాధనా రామ్, సుదేవ్ నాయర్, సిమ్రాన్ రిషి బగ్గా, రసూల్ పూకుట్టి, కుష్బూ, సాగర్ (ప్లయ్‌బ్యాక్ సింగర్ తెలుగు సినిమాలు), మంగ్లీ (ప్లేబ్యాక్ సింగర్ తెలుగు సినిమా), నితిన్, అక్షర హాసన్, తేజ ధర్మ, డి. సురేష్ బాబు, కె. ఎస్. రామారావు, అల్లు అరవింద్, శరత్ మరార్, సతీష్, నవదీప్ తదితర దక్షిణ భారత సినీ ప్రముఖుల ఈ ప్రెస్‌మీట్‌లో హాజరయ్యారు.
ఐఐఎఫ్‌ఏ ఉత్సవం 2024 యొక్క అధికారిక భారత ప్రెస్ కాన్ఫరెన్స్‌లో వారి హాజరుతో ఈవెంట్‌కు మరింత వైభవాన్ని జోడించారు. అంతేకాకుండా గౌరవనీయులైన ప్రముఖులు, ఐఐఎఫ్‌ఏ ఉత్సవం 2024 భాగస్వాములైన… అబ్దుల్లా యూసుఫ్ మొహమ్మద్– అంతర్జాతీయ కార్యకలాపాలు
డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజం అబుదాబి, నవాఫ్ అలీ అల్జహదామి ఫెస్టివల్స్ యూనిట్ హెడ్ అబుదాబి, ఈవెంట్స్ బ్యూరో డిపార్ట్‌మెంట్ (డీసీటీ) తగ్రిద్ అల్ సయీద్‌తో పాటు గ్రూప్ కమ్యూనికేషన్స్ డెస్టినేషన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్
మార్కెటింగ్, మిరల్, యస్ ఐలాండ్‌తో పాటు శ్రీమతి ఫరీదా ఎఫ్ అజ్మల్, ఫౌండర్, ఫరీదా అజ్మల్ పెర్ఫ్యూమ్స్, శ్రీ పృథ్వీ ఆనంద్, డైరెక్టర్
సేల్స్ అండ్ మార్కెటింగ్, నోవాటెల్ హైదరాబాద్ కన్వెన్షన్ సెంటర్ –హెచ్‌ఐసీసీ, వీ క్యాబ్స్ ఇండియా, జ్ఞానేశ్వర్ వెంకటేష్ సాధు,పి. కిరణ్, జెమినీ టీవీ, సన్ నెట్‌వర్క్ హెడ్ తదితరలు ప్గాన్నారు.
ఈ సందర్బంగా మిరల్ యొక్క గ్రూప్ కమ్యూనికేషన్స్ మరియు డెస్టినేషన్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తగ్రిద్ అల్ సయీద్ మాట్లాడుతూ., యాస్ ద్వీపానికి ఐఐఎఫ్‌ఏ ఉత్సవం 2024ను స్వాగతించడం పట్ల ఎంతో ఉత్సాహంగా, ఆతృతగా ఉంది, ఇది అంతర్జాతీయ గమ్యస్థానంగా మా ద్వీçపాన్ని సుస్థిర స్థానం అందించడానికి మరింత దోహదపడుతుందని పేర్కొన్నారు. వినోదం, సాంస్కృతిక వైవిధ్యం కోసం గ్లోబల్ వేదికగా మార్చాలనే మా నిబద్దతకు ఇది నిదర్శనంగా మారిందని సంతోషాన్ని వ్యక్తం చేశారు.
దక్షిణ భారత సినిమా యొక్క విశిష్టమైన, శక్తివంతమైన ప్రతిభను అబుదాబికి తీసుకురావడానికి భాగస్వామ్యం చేయడం ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుందని అన్నారు. ఈ సెప్టెంబర్‌లో సినీ అభిమానులను, ఆర్టిస్టులను అద్భుతమైన మరపురాని సినిమా వేడుకలో ఏకం చేస్తూ మరో వినీల ప్రపంచాన్ని అప్వాదించనున్నామని అన్నారు.
ఈ కార్యక్రమం అసాధారణ ప్రతిభను హైలైట్ చేస్తూనే దక్షిణ భారతదేశం యొక్క శక్తివంతమైన సినీ కథనానికి పెరుగుతున్న గుర్తింపును నొక్కిచెప్పింది. సినిమా ప్రపంచంలో ఈ ప్రాంతం యొక్క ప్రాముఖ్యత ఊహించనంతగా పెరుగుతోంది. హైదరాబాద్ వేదికగా సెలబ్రిటీలతో నిండిన ఐఐఎఫ్‌ఏ ఉత్సవం ఇండియా ప్రెస్ కాన్ఫరెన్స్ నేపథ్యంలో అత్యంత ప్రభావవంతమైన అంశాలను ఒకచోట చేర్చింది. ఈ సందర్భంగా భారతీయ చలనచిత్ర పరిశ్రమలోని ప్రముఖులు డి. సురేష్ బాబు, కె. ఎస్. రామారావు, అల్లు అరవింద్, శరత్ మరార్ తదితరలు ఈ కార్యక్రమంలో భాగంగా చర్చించిన పలు అంశాలు సినీ పరిశ్రమకు భవిష్యత్ మార్గదర్శకాలను చూపించింది. ఈ సమావేశం కొనసాగుతున్న కొద్ది భారతీయ సినిమా యొక్క శక్తివంతమైన డైనమిక్ ల్యాండ్‌స్కేప్‌కు సంబంధించిన విశిష్ఠ అంశాలను చర్చిందింది. ఈ ఉత్సవంలో హోస్ట్‌లు ఆర్టిస్టులు ఎనర్జిక్ ప్రదర్శనలతో అలరించారు.
Also Read:19న పేక మేడలు
ముఖ్యంగా ఐఐఎఫ్‌ఏ ఉత్సవం’ 2024లో భాగంగానే తెలుగు స్ట్రీమ్ నుంచి హోస్ట్‌లుగా రానా దగ్గుబాటి, తేజ సజ్జా విశేషంగా ఆకట్టుకున్నారు. అనంతరం రాశి ఖన్నా మరియు శ్రీలీల వైవిధ్యమైన ప్రదర్శనల గురించి వినోదభరితంగా చర్చించారు.
ఈ ఈవెంట్‌కు మరొక శక్తివంతమైన కోణాన్ని జోడిస్తూ, విభిన్న కోణాలను సృషించడం కోసం కన్నడ హోస్ట్ విజయ్ రాఘవేంద్ర… నటి ప్రగ్యా జైస్వాల్, మాలాశ్రీ మరియు ఆరాధనా రామ్‌లను ఆహ్వానించడానికి వేదికపైకి వచ్చారు.
ఐఐఎఫ్‌ఏ ఉత్సవం మలయాళ హోస్ట్‌లు పెర్లే మానే నేతృత్వంలో… దక్షిణ భారత సినిమాపై ఆకర్షణీయమైన చర్చలు జరిపారు. సుదేవ్ నాయర్, కుష్బూ, అక్షర హాసన్ మరియు సిమ్రాన్ రిషి బగ్గా ఇందులో భాగస్వామ్యం కావడంతో ఈ చర్చ మరింతæ సుసంపన్నమైంది.
విభిన్న భాషలు, విభిన్న వేదికల సూపర్‌స్టార్స్‌తో ఈ వేదిక దక్షిణాది సినిమా ప్రపంచం యెక్క పలు కీలక అంశాలను చర్చిస్తూ భవిష్యత్ ప్రణాళికలకు పరిష్కారాలను అందించారు.
సెప్టెంబర్ 6వ తేదీ శుక్రవారం, 7 శనివారం అబుదాబి, యస్ ద్వీపం, ఎతిహాద్ అరేనాలో జరిగే అంగరంఘవైభవ వేడుకలకు సంబంధించి అభిమానులకు గణమైన హామీనిచ్చింది.
ఈ నేపథ్యంలో ఐఐఎఫ్‌ఏ ఉత్సవం వ్యవస్థాపకుడు/డైరెక్టర్ ఆండ్రీ టిమ్మిన్స్ తన అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ., ‘‘అబుదాబిలోని యస్ ద్వీపానికియూఏఈ టోలరెన్స్ అండ్ ఎగ్జిస్టెన్స్ మంత్రి షేక్ నహ్యాన్ బిన్ ముబారక్ ఏఐ నహ్యాన్ హాజరు కావడం ఎంతో గౌరవప్రదమైన విషయం. తమిళం, తెలుగు, మలయాళం మరియు కన్నడ సినిమాల యొక్క వైవి«ధ్యమైన, విశిష్టమైన పరిశ్రమలను ఏకం చేస్తూ ప్రపంచ వేదికను మరోసారి నిర్మించండానికి సిద్దంగా ఉందని పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ వేడుకలతో దక్షిణాది సినిమా వినూత్న పోకడలను, విశిష్ట మార్పులను, ప్రతిభను వెలుగులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంతర్జాతీయ స్థాయి సినీ ప్రేక్షకులు, దక్షిణ భారత సినిమా యొక్క ప్రపంచ ప్రాముఖ్యతను మరోసారి విక్షించడానికి అందిస్తున్న ప్రధానమైన సహకారాన్ని పునరుద్ఘాటించారు. భిన్న సంస్కృతులు, కళాత్మక వ్యక్తీకరణల వేదికను సృష్టించడం మా దృష్టి కోణమని ఆండ్రీ టిమ్మిన్స్ తెలిపారు. దక్షిణ భారత సినిమా గ్లోబల్ వేదికగా ప్రకాశిస్తుంది, దాని గొప్ప సినిమా వారసత్వంపై ఎన్నో∙ప్రశంసలు కురిపిస్తుందని అన్నారు.