ఐఫా 2017 : విజేతలు వీరే..

236
- Advertisement -

దక్షిణాది తారాతోరణంతో హైదరాబాద్ నగరం తళుక్కుమంది. అతిపెద్ద సినీ అవార్డుల పండుగ ఐఫా 17వ అవార్డ్స్ ఉత్సవం.. హెచ్ఐసీసీ హైటెక్స్ లో అత్యద్భుతంగా జరిగింది. రెండు రోజుల పాటు కన్నుల పండువగా సాగి ఈ ఉత్సవం  అభిమానులను ఆద్యంతం ఆకట్టుకుంది. తెలుగు, తమిళ్‌, కన్నడ, మళయాలీ తారలతోపాటు బాలీవుడ్ నటులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రెడ్ కార్పెట్ పై హొయలొలుకుతూ.. అభిమానులను అలరించారు…

ఐఫా ఉత్సవంలో భాగంగా రెండో రోజు తెలుగు, కన్నడ సినీ అవార్డుల ఉత్సవం జరిగింది. తెలుగు భాషకి సంబంధించి అవార్డుల వేడుకని నిర్వహించగా, ఈ కార్యక్రమాన్ని రానా, నాని హోస్ట్ చేశారు. అఖిల్, సాయిధరమ్ తేజ్, సమంత, రాయ్ లక్ష్మీ కార్యక్రమంలో తమ స్టెప్పులతో అలరించారు.

IIFA Utsavam 2017: Janatha Garage win top awards

ఎన్టీఆర్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన జనతాగ్యారేజ్‌కు అవార్డుల పంట పండింది. ఈ సినిమాలో నటనకు గాను ఎన్టీఆర్ బెస్ట్ హీరో అవార్డు గెలుచుకోగా ఉత్తమ దర్శకుడిగా కొరటాల శివ, ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్ ఎంపికయ్యారు. బెస్ట్ లిరికిస్ట్‌గా రామజోగయ్య శాస్త్రి(సోగ్గాడే చిన్ని నాయన), ప్లే బ్యాక్ సింగర్‌గా గీతా మాధురి(పక్కా లోకల్-జనతా గ్యారేజ్) అవార్డులను అందుకున్నారు.

ఉత్తమనటుడిగా ఎంపికైనందుకు సంతోషం వ్యక్తం చేసిన ఎన్టీఆర్ తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ అందించినందుకు దర్శకుడు కొరటాల శివకు థ్యాంక్స్ చెప్పారు. ఈ అవార్డుకు తనతో పాటు నామినేషన్‌ సాధించిన హీరోలందరి పేర్లూ చదివి వినిపించాడు. ఈ నామినేషన్‌ పొందిన హీరోలందరూ తమ తమ సినిమాల్లో అద్భుత నటన ప్రదర్శించారంటూ ప్రశంసించాడు. అలాగే తానందుకున్న ఈ అవార్డు తానొక్కడికే కాదని, ఈ హీరోలందరికీ చెందుతుందని వ్యాఖ్యానించాడు. దాంతో ఆహూతులందరూ ఆశ్చర్యపోయి ఎన్టీఆర్‌ను చప్పట్లతో అభినందించారు.

ఈ సందర్భంగా రానా,నాని అడిగిన ప్రశ్నలకు ఎన్టీఆర్ తనదైన శైలీలో సమాధానం చెప్పారు. మీ ఫేవరేట్ యాక్టర్ ఎవరు అని అడగగా తనకు ప్రత్యేకంగా ఎవరు ఫేవరేట్ యాక్టర్ లేరని చెప్పుకొచ్చారు. బాహుబలిలో రానా అద్భుతంగా నటించాడని….టాలీవుడ్‌లో రానా బెస్ట్ యాక్టర్‌ అని కొనియాడిన ఎన్టీఆర్ …. మహేష్ బాబు మోస్ట్ హ్యాండ్సమ్ హీరో అంటూ కితాబిచ్చాడు.

IIFA Utsavam 2017: Janatha Garage win top awards
సమంత అ..ఆ సినిమాకు గాను బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు అందుకుంది. అల్లు అర్జున్ రుద్రమదేవి చిత్రానికి గాను బెస్ట్ సపోర్టింగ్ రోల్ అవార్డు అందుకున్నాడు. అనుపమ పరమేశ్వరన్ ప్రేమమ్ చిత్రానికి గాను బెస్ట్ సపోర్టింగ్ ఫీమేల్ రోల్ అందుకుంది. పెళ్లి చూపులు ఫేం ప్రియదర్శిని కామిక్ రోల్ లో బెస్ట్ యాక్టర్ అవార్డు గెలుచుకోగా , ఉత్తమ కథగా కంచె (క్రిష్) , ఉత్తమ చిత్రంగా జనతా గ్యారేజ్ ఎంపికైంది. బెస్ట్ నెగటివ్ రోల్ యాక్టర్‌గా జగపతి బాబు(నాన్నకు ప్రేమతో) అవార్డులను అందుకున్నారు.

- Advertisement -