కలర్‌ఫుల్‌గా ఐఫా అవార్డ్స్ ఉత్సవం…

257
IIFA awards event in Hyderabad
IIFA awards event in Hyderabad
- Advertisement -

అతిపెద్ద సినీ అవార్డుల పండుగ ఐఫా 17వ అవార్డ్స్ ఉత్సవం అత్యద్భుతంగా సాగుతోంది. రెండు రోజుల పాటు జరిగే ఈ అవార్డ్స్ వేడుక కోసం తెలుగు, తమిళ్, మళయాలం నటులతో పాటు బాలీవుడ్ తారలు తరలివచ్చారు. ఈ ఈవెంట్‌లో ఎందరో ఫేమస్ తారలు తమ పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టనున్నారు. అక్షర హాసన్, ప్రగ్యా జైశ్వాల్, లక్ష్మీరాయ్ స్పెషల్ అప్పియరెన్స్‌తో కనువిందు చేయనున్నారు.

ఐఫా అవార్డ్స్ వేడుకల్లో పాల్గొనడం ఒక్క ప్రదేశంలో కలుసుకోవడంపై నటులు, నటీమణులంతా సంతోషం వ్యక్తం చేశారు. అవార్డ్ అందుకున్న సహనటీనటులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతిష్టాత్మిక అవార్డ్స్ అందుకున్న నటులతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. భారతీయ సినిమాలో అత్యుత్తమమైన అవార్డ్స్ వేడుకల్లో పాలుపంచుకోవడం మరచిపోలేని అనుభూతన్నారు.

సీఎం కేసీఆర్ మనుమడు హిమాన్షు కూడా ఈ ఆవార్డుల కార్యక్రమానికి హాజరయ్యాడు. తనకు ఫేవరేట్ హీరోలెవరూ లేరని అన్నాడు. అన్ని సినిమాలు చూస్తానని చెప్పాడు. ఎవరి సినిమా అయినా నచ్చితే మళ్లీ చూస్తానని చెప్పాడు. అవుట్ డోర్ గేమ్స్ లో స్విమ్మింగ్ ఇష్టమని, ఇన్ డోర్ గేమ్స్ లో అన్ని వీడియో గేమ్స్ తనకు ఇష్టమని చెప్పాడు. ఈ మధ్యే తన తండ్రితో కలిసి కాటమరాయుడు సినిమా చూశానని చెప్పాడు.

 ఐఫా వేడుకలు హైదరాబాద్ లో జరగడం ఇది రెండోసారి. ఈ వేడుకలకు తెలంగాణ టూరిజం సైతం స్పాన్సర్ గా వ్యవహరిస్తోంది. ఈ రోజు వేడుకలకు భారీ ఎత్తున టాలీవుడ్ ప్రముఖులతో పాటు బాలీవుడ్ స్టార్స్ రానున్నారు. ఇక ఇవాళ కన్నడ, తెలుగు ఇండస్ట్రీ అవార్డ్స్ ఉత్సవం జరగనుంది. ఈ అవార్డ్స్ వేడుకను టాలీవుడ్ యంగ్ హీరోలు రానా, నానీ హోస్ట్ చేయనున్నారు.

- Advertisement -