ఫ్రెంచ్ ఓపెన్ ఇగా స్వైటెక్ సొంతం..

156
- Advertisement -

ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో ఇగా స్వైటెక్ టైటిల్ ను కైవసం చేసుకుంది. పారిస్ లోని రోలాండ్ గారోస్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో పోలెండ్ భామ ఇగా స్వైటెక్ 6-1, 6-3తో అమెరికా టీనేజర్ 18 ఏళ్ల కోకో గాఫ్ ను ఓడించింది. ఫ్రెంచ్ ఓపెన్ లో స్వైటెక్ కు ఇది రెండో టైటిల్. గతంలో ఆమె 2020లోనూ ఇక్కడి క్లే కోర్టుపై విజేతగా నిలిచింది. కాగా, స్వైటెక్ కు ఈ మ్యాచ్ లో సాధించిన విజయం వరుసగా 35వది కావడం విశేషం. దీంతో, 2000 సంవత్సరంలో వీనస్ విలియమ్స్ నెలకొల్పిన 35 వరుస విజయాల రికార్డును స్వైటెక్ సమం చేసింది.

ఇక అమెరికా సంచలనం కోకా గాఫ్‌ తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌కు చేరినా.. అదే జోరును ఫైనల్లో ప్రదర్శించలేకపోయింది. ఫ్రెంచ్‌ ఓపెన్‌ తొలిరౌండ్‌ నుంచి ఒక్క సెట్‌ను కోల్పోకుండా ఫైనల్‌కు చేరిన కోకా గాఫ్‌.. ఫైనల్లో సునాయాసంగా ఓటమిపాలవ్వడం విశేషం.

- Advertisement -