18న ఇఫ్తార్ విందు

210
Telangana govt to hold Iftar party on June 18th at LB Stadium..
Telangana govt to hold Iftar party on June 18th at LB Stadium..
- Advertisement -

రంజాన్ మాసం సందర్భంగా ఈ నెల 18న ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేయనున్న ఇఫ్తార్ విందులో సీఎం కేసీఆర్ పాల్గోననున్నారు. రంజాన్‌ను పురస్కరించుకొని సీఎంను రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సయ్యద్ అక్బర్ హుస్సేన్ ప్రగతిభవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎంకు పుష్పగుచ్ఛం అం దజేసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం ముస్లింలకు దావతే ఇఫ్తార్ ఏర్పాటు చేస్తుందని హుస్సేన్ తెలిపారు. రంజాన్ ప్రార్ధనల కోసం మసీదులకు మరమ్మతులు, పేదలకు దుస్తులు, ఇమామ్‌ల జీవనభృతి కోసం రూ. 28 కోట్లు కేటాయించినందుకు ఆయన సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. గతేడాది రంజాన్ కంటే ఈ ఏడాది రంజాన్ మాసంలో పది కోట్లను అదనంగా ప్రభుత్వం విడుదల చేసిందన్నారు.

- Advertisement -