మీ చెప్పుతో కొట్టండి..

293
If you want to forgive me for millions of times:sri reddy
- Advertisement -

పవన్ కల్యాణ్‌ తల్లిపై శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యల నేపధ్యంలో టాలీవుడ్‌లో పెద్ద గందరగోళం జరుగుతోంది. దీనిపై నిన్న (శుక్రవారం) పవన్ కల్యాణ్‌, నాగబాబు ఫిల్మ్ చాంబర్‌లో నిరసన చేసిన విషయం తెలిసిందే. గతంలో నటి శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యల   పట్ల తన పవన్ తల్లికి క్షమాపణ చెప్పారు. తాజాగా ఇదే వ్యవహారంపై ట్వి్ట్టర్ ద్వారా శ్రీరెడ్డి స్పందిస్తూ     మరోసారి పవన్ కల్యాణ్‌ తల్లి క్షమాపణలు తెలిపింది.

ట్విట్టర్‌లో ఈ విధంగా స్పందిస్తూ…‘‘పవన్ కల్యాణ్ అమ్మగారికి నా శిరస్సు వంచి పది లక్షల సాష్టాంగ నమస్కారాలు.  నన్ను క్షమించండి అమ్మ, మీ చెప్పుతో కొట్టండి. కానీ సినీ పెద్దలకు మిమ్మల్ని అంటే కానీ అర్థం కాలేదమ్మా ఈ ఒంటరి ఆడపిల్ల బాధ. మీ ఫోటో చూసి పది లక్షల సార్లు క్షమించమని వేడుకున్నా అమ్మ’’ అంటూ ట్వీట్ చేసింది.

 If you want to forgive me for millions of times:sri reddy
అంతకు ముందు చేసిన ట్వీట్‌లో ‘‘ఫ్యాన్స్ అంటే జనసేన సిద్ధాంతాలకు కట్టుబడి ఉండి, ప్రజల సమస్యల కోసం   పోరాడుతూ.. నలుగురికి మార్గదర్శకం అవ్వాలి. అంతేకానీ సహనం లేకుండా కార్‌లు పగలగొట్టడం కాదు. ఫ్యాన్స్ పవన్ కల్యాణ్ గారికి బలం అవ్వాలి కానీ బలహీనత కాకూడదు’’ అని తెలిపింది. శుక్రవారం ఫిల్మ్ ఛాంబర్‌కు అల్లు అర్జున్,      రామ్ చరణ్ రాకపై ఆమే స్పందిస్తూ.. మెగా ఫ్యామిలీ ఇలా ఎప్పుడో స్పందించి    ఉంటే చాలా హూందాగా ఉండేదని, ఏది ఏమైనా రామ్ చరణ్, అల్లు అర్జున్‌కి తాను వీరాభిమానినని ట్విట్టర్‌లో తెలిపింది.

- Advertisement -