కర్నాటక ఎన్నికలు ముగిసిపోవడంతో ఇప్పుడు అందరి చూపు ఫలితాలపై పడింది. మరికొద్ది గంటల్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుండగా రేపటితో కన్నడిగులు ఏ పార్టీకి పట్టం కడతారనేది తేలిపోనుంది. ప్రస్తుతం బిజెపి, కాంగ్రెస్, జేడీఎస్ మూడు ప్రధాన పార్టీలు కూడా గెలుపు విషయంలో ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉండడంతో విజయం ఏ పార్టీని వరిస్తుందనే ఉత్కంఠ అందరిలోనూ ఉంది. అటు ఎగ్జిట్ పోల్స్ కూడా ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం కనబరచకపోవడంతో 2018 సీన్ మళ్ళీ రిపీట్ కానుందా అనే సందేహాలు తెరపైకి వస్తున్నాయి. .
ప్రస్తుతం సర్వేలు, విశ్లేషకులు చెబుతున్నా దాని ప్రకారం హంగ్ ఏర్పడడానికే అధిక అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ హంగ్ ఏర్పడితే మళ్ళీ జెడిఎస్ పార్టీ కింగ్ మేకర్ పాత్ర పోషించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జేడీఎస్ ఏ పార్టీకి మద్దతు ఇవ్వబోతుంది ? హంగ్ విషయంలో జేడీఎస్ అగ్రనేతలు ఏం ఆలోచిస్తున్నారు ? అనే చర్చ జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో హంగ్ వస్తే తమ ప్రణాళికలు ఎలా ఉండబోతున్నాయనే దానిపై జేడీఎస్ అగ్రనేత కుమారస్వామి తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ బీజేపీ పార్టీల నుంచి ఇప్పటికే ఆఫర్స్ వస్తున్నాయన్ని ఏ పార్టీతోనైనా కలిసేందుకు తాము సిద్దమే అని కుమారస్వామి వెల్లడించారు.
Also Read: హ్యాపీ బర్త్‌డే…పళనిస్వామి
అయితే గతంలో కాంగ్రెస్ తో కలిసే ప్రసక్తే లేదని దేవగౌడ చెప్పుకొచ్చారు. కాగా హంగ్ ఏర్పడేందుకే అధిక అవకాశం ఉండడం మళ్ళీ మనసు మార్చుకొని కాంగ్రెస్ తోనైనా, బీజేపీతోనైనా, కలిసేందుకు తాము సిద్దమే అనే సంకేతాలు ఇచ్చారు. అయితే ఏ పార్టీతో కలిసిన సిఎం పదవే జేడీఎస్ ప్రధాన టార్గెట్ అని తెలుస్తోంది. గత ఎన్నికల్లో 37 స్థానాలనే గెలుచుకున్న జేడీఎస్.. కాంగ్రెస్ కు మద్దతు తెలిపి కుమారస్వామి సిఎం పదవి అధిష్టించారు. అదే ప్లాన్ తో ఈసారి కూడా జేడీఎస్ అగ్రనేతలు ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఏం జరగబోతుందో తెలియాలంటే ఫలితాల వరకు ఎదురు చూడాల్సిందే.
Also Read: రచ్చ లేపుతున్న మహారాష్ట్ర రాజకీయం !