ఇవి తింటే మతిమరుపు మాయం.. !

48
- Advertisement -

నేటి రోజుల్లో చాలా మందికి మతిమరుపు సమస్య వేధిస్తూ ఉంటుంది. సాధారణంగా వయసు పైబడిన వారిలో మాత్రమే కనిపించే ఈ మతిమరుపు సమస్య ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లల నుంచి యుక్త వయసు ఉన్నవారిలో కూడా కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం మారుతున్న జీవన విధానం, ఆహారపు అలవాట్లే అని చెప్పవచ్చు. ఈ మరుపు సమస్యను అదిగమించేందుకు వివిధ రకాల మెడిసన్స్ తీసుకుంటూ ఉంటాం. కానీ మతిమరుపు సమస్యను మాత్రం పూర్తిగా అధిగమించలేము. అయితే మనం తీసుకునే ఆహార పదార్థాలలో కొన్నిటిని మన డైట్ లో జత చేసుకున్నామంటే ఈ మతిమరుపు సమస్యను ఇట్టే దూరం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

అవకాడో, కోడిగుడ్లు, ఆకు కూరలు.. వంటివి మెదడు చురుకుదనాన్ని పెంచే గుణాలను కల్గి ఉంటాయి. కాబట్టి మనం తీసుకునే ఆహారంలో పైన చెప్పినవి ఉండేలా చూసుకోవాలి. సి విటమిన్ ఎక్కువగా ఉండే నిమ్మ, అవకాడో, ఆరెంజ్.. వంటివి ఎక్కువగా తినడం వల్ల మెదడు చురుకుదనం పెరిగి, జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది. ఇక కోడి గుడ్డులో ఉండే విటమిన్ బి6, విటమిన్ కె, వంటివి కూడా మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. ఇక ఆకు కూరలలో ఉండే ఎన్నో పోషకాలు.. మెదడుకు అన్నీ రకాల పోషణలు అందించి ఆరోగ్యంగా ఉంచడంలో దోహదం చేస్తాయి. కాబట్టి మెదడు పనితీరు మెరుగుపరచుకోవాలన్నా ఆహార డైట్ లో తప్పకుండా ఆకు కూరలను చేర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

ఇక వీటితో పాటు బ్లూ బెర్రిస్ కూడా మతిమరుపును దూరం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇందులో ఉండే ఫ్లెవనాయిడ్స్ మతిమరుపు రాకుండా మెదడు పనితీరును మెరుగు పరుస్తాయి. వీటితో పాటు ఒమేగా 3 ఉండే చేపలు ( ట్యూనా ఫిష్, సల్మాన్ ఫీష్‌,.. వంటివి ) కూడా తింటే మెదడుకు ఎంతో మంచిది. ఇక మతిమరుపును దూరం చేసి జ్ఞాపక శక్తిని పెంచడంలో వ్యాయామం పాత్ర కూడా ఉంటుంది. కాబట్టి ప్రతిరోజూ క్రమం తప్పకుండా ద్యానం, శారీరక శ్రమ వంటివి కూడా అవసరమే అని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి మతిమరుపుతో బాధపడే వాళ్ళు పై సూచనలు, ఆహార నియమాలు పాటిస్తే ఆ సమస్యను చాలా ఈజీగా అధిగమించవచ్చు.

Also Read: Bigg Boss 7 Telugu:ఓటింగ్‌లో వెనుకబడ్డ అమర్

- Advertisement -