యెడ్డీకింటే…సిద్ధూ బెటర్‌‌.. : ప్రకాశ్‌రాజ్‌

198
'If Yeddyurappa becomes CM, he won't last for even three months ...
- Advertisement -

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ..నటుడు ప్రకాశ్‌రాజ్ నోటినుంచి సంచలన వ్యాఖ్యలు బయటపడుతున్నాయి. ఈ మధ్య ప్రకాశ్‌రాజ్‌ ఏది మాట్లాడినా సంచలనంగానే మారుతోంది. అయితే ప్రకాష్ మాటలు బీజేపీకి షాకింగ్‌గా మారుతుండగా..కాంగ్రెస్‌కి మాత్రం సర్‌ప్రైజింగ్ గా మారాయి. అయితే తాజాగా ప్రకాశ్‌రాజ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

'If Yeddyurappa becomes CM, he won't last for even three months ...బీజేపీకి చెందిన యడ్యూరప్పతో పోల్చితే..కాంగ్రెస్‌కి చెందిన సిద్దరామయ్య సీఎంగా ఎంతో బెటర్‌ అంటూ వ్యాఖ్యానించారు. ఒకవేళ బీజేపీ గెలిచి యడ్యూరప్ప కర్ణాటక ముఖ్యమంత్రి అయినా ఆయన మూడు నెలలకు మించి ఆ పదవిలో ఉండలేరని అన్నారు. మతానికి తాను వ్యతిరేకం కాదని.. మతం వెలుగును ఇవ్వాలే తప్పించి అంధకారంలోకి నెట్టేయకూడదన్నారు.

అయితే సిద్దరామయ్యకు అనుకూలంగా ప్రకాశ్‌ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. బీజేపీకి వ్యతిరేకంగా ఇప్పటివరకూ పలు వ్యాఖ్యలు చేసినప్పటికీ..కాంగ్రెస్ కు అనుకూలంగా ఇంత ఓపెన్‌ గా ప్రకాశ్‌ వ్యాఖ్యానించింది లేదు. కాగా.. ఈ మధ్య తరచూ రాజకీయాలపై వ్యాఖ్యానించడానకి కారణంమేంటని ప్రకాశ్ రాజ్ ను ప్రశ్నించిన మీడియా ప్రతినిధులకు…”ఏం.. సినిమా నటులు రాజకీయాల గురించి మాట్లాడకూడదా?” అంటూ సమాధానమిచ్చారు.

'If Yeddyurappa becomes CM, he won't last for even three months ...ఇక ఇదిలా ఉండగా..తన ఆప్త మిత్రురాలు.. జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ దారుణహత్య తర్వాత నుంచి ఆయన రాజకీయాల గురించి తన మనసులోని మాటల్ని చెప్పటం మొదలు పెట్టారు. ఆమె మరణం తర్వాత ప్రకాశ్ రాజ్ లో చాలానే మార్పులు వచ్చాయి. రాజకీయాలతో పాటు సామాజిక అంశాల విషయంలోనూ ఆయన తరచూ స్పందిస్తున్నారు.

- Advertisement -