టీడీపీ అధికారంలోకి వస్తే.. పరిస్థితేంటి?

31
- Advertisement -

ఏపీలో అధికార వైసీపీ మరియు టీడీపీ మద్య రాజకీయ రగడ ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుంది. అయితే కొన్ని సార్లు ఈ రెండు పార్టీల మద్య చోటు చేఊసుకునే పరిణామాలు హింసాత్మక ఘటనలకు కూడా దారి తీస్తూ ఉంటాయి. ఇదిలా ఉంచితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత విమర్శించే విధానం చాలా వరకు మారిపోయింది. గతంలో ఎలాంటి విమర్శలు చేసిన రాజకీయాల వరకే పరిమితం అయ్యేవి తప్పా ప్రజెంట్ చేస్తున్న విమర్శలు స్టేజ్ దాటి వ్యక్తిగతం గా మారుతున్నాయి. ఇటీవల మంత్రి రోజాపై టీడీపీ నేత బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమరాన్ని రేపుతున్నాయి. అయితే వైసీపీ నేతలు చేసే విమర్శలు తక్కువేంకాదు అనేది మరికొందరు చెబుతున్నా మాట.

ఆర్కే రోజా, కొడాలి నాని, పెర్ని నాని వంటి వారు మీడియా సమావేశాల్లో గాని, అసెంబ్లీ సభల్లో గాని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పై, అలాగే లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇలా ప్రస్తుతం ఏపీలో టీడీపీ వైసీపీ మద్య నువ్వా నేనా అన్నట్లు విమర్శల దాడి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. ” తాము అధికారంలోకి వస్తే వైసీపీ నాయకుల తాట తీస్తామని టీడీపీ నేతలు చెబుతున్నారని.. ఒకవేళ నిజంగానే టీడీపీ అధికారం లోకి వస్తే మన పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి ” అంటూ తన పార్టీ నేతలపైనే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దీంతో బాలినేని వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపుపై సొంత పార్టీ నేతల్లోనే అనుమానలు ఉన్నాయా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు కొందరు. అయితే గత కొంత కాలంగా బాలినేని పార్టీలో అసంతృప్తిగా ఉంటున్నారు. అందుకే ఈ తరహా వ్యాఖ్యలు చేశారనేది కొందరు చెబుతున్నా మాట.

Also Read:మహిళలల్లో మధుమేహం.. చాలా ప్రమాదం!

- Advertisement -