తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావొద్దని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు, వరదలపై సీఎం కేసీఆర్ నిరంతరం సమీక్షిస్తున్నారు. రాజకీయాలకతీతంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రజాప్రతినిధులు, అధికారులకు ఎప్పటికప్పుడు తగిన ఆదేశాలు అందిస్తూ కుటుంబ పెద్దలా అండగా నిలుస్తున్నారని తెలిపారు. . ప్రసవానికి వారం గడువున్న గర్భిణులను ముందుగానే దవాఖానాలకు తరలించి, ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని ఎమ్మెల్సీ కవిత చెప్పారు. ఒక వైపు ప్రభుత్వం.. మరోవైపు టీఆర్ఎస్ పార్టీ నాయకులు సైతం ఎక్కడికక్కడ వరద సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజలకు ధైర్యాన్నిస్తున్నారని కవిత చెప్పారు. ఈ మేరకు గురువారం ఆమె ట్వీట్ చేశారు. వరద ప్రాంతాల్లో వైద్యం, విద్యుత్, తాగునీటి వసతులకు ఎలాంటి అవాంతరాలు రాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దన్నలా వ్యవహరిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు : ఎమ్మెల్సీ కవిత
- Advertisement -
- Advertisement -