సర్వేలు,ఏపీ ప్రజల నాడీని పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమనే సంకేతాలు వినిపిస్తున్నాయి. జగన్ సీఎం కావడం పక్కా అనే ప్రచారం జరుగుతుండటం,మరోవైపు ఆయన కూడా ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే సీనియర్ నేతలను పాలనలో భాగస్వామ్యం చేయడానికి ప్రయత్నాలు చేస్తుండగా మరోవైపు కొందరు నేతలు ఇప్పటికే జగన్ ముదు తమ కొరికల చిట్టా విప్పుతున్నారు.
ఇక జగన్ ఏపీ సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తే ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు పెద్దపీట వేయడంతో పాటు సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పాలనలో సంస్కరణలు ఉండే విధంగా ఏపీ ఆర్ధిక పరిస్థితి నేపథ్యంలో ముఖ్యమంత్రిగా జగన్ కేవలం ఒక్క రూపాయి జీతాన్ని తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
దీంతో పాటు ఏపీలో ఆర్థిక పరిస్థితులను సరిదిద్దడానికి వివిధ శాఖల్లో చాలాకాలం పాటు పనిచేసి, పదవీ విరమణ చేసిన కొందరు ఐఎఎస్ అధికారులను సలహాదారుగా నియమించుకోనున్నట్లు సమాచారం. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కేవలం ఒక్కరూపాయి జీతం తీసుకున్నారు. ఇప్పుడు అదే ట్రెండ్‌ని కొనసాగించేందుకు జగన్ సిద్ధమైనట్లు పార్టీ నేతలు చెబుతున్నారు.
తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దివంగత జయలలిత కూడా ఒక్కరూపాయే జీతం తీసుకోగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఒక్కరూపాయి కూడా జీతం తీసుకోవట్లేదు.