భూ రిజిస్ట్రేషన్ విషయంలో గతంలో రైతులు పడిన బాధలు అన్నీ ఇన్నీ కావు. అందుకే దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి 2020 లో ధరణి పోర్టల్ ను ప్రారంభించారు. వ్యవసాయ, వ్యవసాయేతర భూ రికార్డుల నమోదు విషయంలో దళారి వ్యవస్థ ద్వారా దోపిడీకి గురవుతున్న ప్రజలకు ఊపిరినిచ్చేలా ధరణి పోర్టల్ ను దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రప్రథమంగా తెలంగాణలో ప్రారంభించారు కేసిఆర్. ప్రభుత్వంలో పారదర్శకత, సామర్థ్యాన్ని పెంచడంతో పాటు, భూ రిజిస్ట్రేషన్, మ్యూటేషన్లు అందిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సురక్షితమైన సేవలందించడం ఈ పోర్టల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఈ పోర్టల్ ద్వారా భూమి, స్థిర ఆస్తులను ఆన్లైన్ లో నిల్వ ఉంచుతూ రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిముషాల్లోనూ పూర్తి అవుతుంది..
తద్వారా ఎంతో మంది రైతులకు భూ రిజిస్ట్రేషన్ విషయంలో లబ్ది పొందుతున్నారు. ధరణి అమల్లోకి వచ్చినది మొదలుకొని దళారి వ్యవస్థ పూర్తిగా నశించిపోయి.. అన్నీ పనులు పారదర్శకంగా జరుగుతున్నాయి. మరి ఇంతటి ఉపయోగకరంగా ఉన్న ధరణి పోర్టల్ ను తాము అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని కాంగ్రెస్ చెప్పడం నిజంగా ఆ పార్టీ అజ్ఞానానికి నిదర్శనమని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రజలకు ఉపయోగ పడే వాటిని హస్తం పార్టీ ఎందుకు రద్దు చేయాలని చూస్తోంది అనే దానిపై కూడా విశ్లేషకులు వారి వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు,
ధరణి రద్దు చేసి మళ్ళీ దళారీ వ్యవస్థను తీసుకొని వచ్చి భూ దందా కు పాల్పడుతూ వేల కోట్లు వెనకేసుకోవాలనేది హస్తం నేతల ప్లాన్ గా తెలుస్తోంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలపై ఉన్న కుంభకోణాలు అన్నీ ఇన్ని కావు. తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీకి చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డి ఓటుకు నోటు స్కామ్ లో వేల కోట్ల అవినీతికి పాల్పడిన సంగతి విధితమే. ఇప్పుడు మళ్ళీ అలాంటి అవినీతికి తావిచ్చేలా ధరణి రద్దు చేసి దళారి వ్యవస్థకు శ్రీకారం చుట్టాలని కుయుక్తులు పన్నుతున్నారు హస్తం నేతలు. మరి హస్తం నేతల వంకర బుద్ధి తెలంగాణ ప్రజానీకానికి తెలియంది కాదు. ఎన్నికల్లో కాంగ్రెస్ కు గట్టిగా బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని విశ్లేషకులు సైతం కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నారు.
Also Read:కాలింగ్ సహస్త్రతో సందడి చేస్తాం: సుధీర్