రూపాయికే 5జీబి..4జీ డేటా

237
- Advertisement -

రిలయన్స్‌ జియో రాకతో టాప్‌ మొబైల్‌ ఆపరేటర్లు ముఖ్యంగా ఎయిర్‌టెల్, ఐడియాలు కొత్త కస్టమర్లేమోకాని ఉన్న కస్టమర్లను కపాడుకునే ప్రయత్నంలో పడ్డాయి. రిలయన్స్‌ ప్రవేశపెట్టిన ఉచిత ఆఫర్లతో ఎయిర్‌టెల్, ఐడియాకు కోట్ల నష్టాన్ని మిగిల్చాయి. దీంతో ఆత్మరక్షణలో పడ్డ టెలికాం కంపెనీలు బంపరాఫర్స్ ప్రకటిస్తున్నాయి. పోటీపడి మరీ డేటా గిరి ఇస్తున్నాయి.

ఇంటర్నెట్ వాడకానికి దూరంగా ఉంటున్న యూజర్లను ఆకట్టుకోవడానికి ఐడియా సెల్యులార్ బంఫర్ ఆఫర్ ప్రకటించింది.తాజాగా ఐడియా నెట్ వర్క్ రూపాయికే అన్‌లిమిటెడ్‌ 4జీ డేటా ఇస్తున్నట్లు సంచలన ప్రకటన చేసింది. ఈ ఆఫర్ ను పొందాలంటే మీ దగ్గర ఐడియా 4జీ సిమ్‌తోపాటు తప్పనిసరిగా 4జీ సపోర్ట్‌ చేసే ఫోన్‌ ఉండాలి. మీ అకౌంట్‌లో రూపాయి బ్యాలెన్స్‌ ఉండాలి. మీ 4జీ హ్యాండ్‌సెట్‌లో ఐడియా సిమ్‌ ఉంచి 411కు కాల్‌ చేయాలి. అందులో చెప్పే సూచనలను ఫాలో అవ్వాలి. సూచనల్లో మీకు 4జీ డేటాకు సంబంధించిన సమాచారం ఉంటుంది.

Idea 4G-Plans-in-AP

… ఆఫర్‌ యాక్టివేట్‌ అయిన తర్వాత మీకు SMS ద్వారా కన్ఫర్మేమేషన్‌ మెసేజ్‌ వస్తుంది. ఇక మీరు 4G అన్‌లిమిటెడ్‌ డేటాను వాడుకోవచ్చు. అయితే ఇది కేవలం ఓ గంట వరకు మాత్రమే. గంట తర్వాత మీకు డేటా పనిచేయదు. ఈ ఆఫర్‌లో మీరు ఐడియా ఇచ్చే సూపర్‌ ఫాస్ట్‌ డేటాను గంట వరకు అన్ లిమిటెడ్ గా వాడుకోవచ్చు.

… ఈ ఒక్క గంటలో మీరు 4GB నుంచి 5 GB వరకు ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇది యాక్టివేట్‌ అయిన తర్వాత మీ పాత డేటా ప్యాక్‌ వెంటనే ఆగిపోతుంది. ఒకే నంబర్‌పై ఈ ఆఫర్‌ను మూడుసార్లు వాడకోవచ్చు. ఆ తర్వాత ఈ ఆఫర్‌ పనిచేయదు. వేరే ఫోన్‌ నుంచి ప్రయత్నిస్తే మళ్లీ ఈ ఆఫర్‌ మీకు వచ్చే అవకాశం ఉంది.

aritel-4g-new-offer

ఇటీవలె టెలికాం దిగ్గజం భారతి ఎయిర్ టెల్ కూడా కొత్త ఆఫర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా రూ.259 రీచార్జ్ పై 10జీబీ 4జీ డేటా ఆఫర్ చేస్తోంది. వినియోగదారులు కొత్తగా కొనుగోలు చేసిన ఏ 4 జీ స్మార్ట్ ఫోన్ కైనా ఈ ఆఫర్ ను అందించనుంది. రీచార్జ్‌ చేసుకున్న వెంటనే ఒక జిబి డేటా తక్షణమే వినియోగదారుని ఖాతాలో జమ చేయబడుతుందనీ, మిగిలిన 9 జీబీ డేటా మై ఎయిర్ టెల్ ఆప్ ద్వారా క్లెయిమ్ చేసుకోవచ్చని ఎయిర్ టెల్ ఇండియా ఒక ప్రకటనలో వెల్లడించింది. 4 జీ అందుబాటులో లేనిచోట 3జీ డాటా వాడుకోవచ్చని తెలిపింది.

- Advertisement -