ఐడియా నుండి ఆదిరిపోయే ఆఫర్స్‌..

246
- Advertisement -

టెలికాం రంగంలో కొత్త కొత్త ఆఫ‌ర్ల‌తో వినియెగ‌దారుల‌ను అట్రాక్ట్ చేస్తుంది రిల‌య‌న్స్ జియో సంస్ధ‌. త‌క్కువ ధ‌ర‌కే ఇంట‌ర్ నెట్ ఇవ్వ‌డంతో పాటు కొత్త కొత్త ప్లాన్ ల‌ను విడుద‌ల చేస్తున్నారు. దీంతో టెలికం రంగంలో ప్ర‌స్తుతం జియో టాప్ నెంబ‌ర్ 1లో కొన‌సాగుతుంది. ఈ పోటీని తట్టుకునేందుకు ఇతర టెలికం సంస్థలు కూడా జియో తరహా ఆఫర్‌లను ప్రవేశపెడుతున్నాయి. ఇప్పటికే పల్లు ఆఫర్లను ఇచ్చిన ఐడియా తాజాగా మరో మూడు ఆఫర్స్‌ను ప్రవేశపెట్టింది.

Idea

టెలికాం కంపెనీ ఐడియా సెల్యులార్ తన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం రూ.209, రూ.479, రూ.529 ధరలలో ఈ రీచార్జి మూడు ప్యాక్‌లు అందుబాటులోకి తీరుకొచ్చింది. ఈ మూడు ప్యాక్‌లలోనూ కస్టమర్లకు రోజుకు 1.5 జీబీ డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు వస్తాయి. ఇక వీటిలో రూ.209 ప్లాన్ వాలిడిటీ 28 రోజులు ఉండగా, రూ.479 ప్లాన్ వాలిడిటీ 84 రోజులు, రూ.529 ప్లాన్ వాలిడిటీ 90 రోజులుగా ఉంది.

- Advertisement -