రిలయన్స్ జియో రాకతో టాప్ మొబైల్ ఆపరేటర్లలో భయం మొదలైంది. ముఖ్యంగా ఎయిర్‌టెల్, ఐడియాలు కొత్త కస్టమర్లేమోకాని ఉన్న కస్టమర్లను కపాడుకునే ప్రయత్నంలో పడ్డాయి. రిలయన్స్‌కు చెందిన జియో డిసెంబర్ వరకు అన్‌లిమిటెడ్ డాటాతో పాటు అన్‌లిమిటెడ్ కాల్స్‌ను ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ రిలయన్స్ ప్రవేశపెట్టిన ఆపర్లు ఎయిర్‌టెల్, ఐడియాకు కోట్ల నష్టాన్ని మిగిల్చాయి. దీంతో ఆత్మరక్షణలో పడ్డ ఈ రెండు కంపెనీలు డేటా ప్యాక్స్ రేట్లను ఇప్పటికే కొంతవరకు తగ్గించేశాయి.
ఎయిర్‌టెల్.. తన వినియోగదారులకు 5జీబీ ఉచిత ఇంటర్నెట్‌ను అందించాలని ఎయిర్‌టెల్ భావిస్తోంది. అయితే ఈ ఆఫర్‌ను పొందాలంటే ఎయిర్‌టెల్ వినియోగదారులకు కొన్ని షరతులను పెట్టింది. ఇక ఐడియా తన కస్టమర్లకు బంపరాఫర్ ప్రకటించింది. తామందిస్తున్న ఐడియా సెల్యులార్ మూవీ క్లబ్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని ఏ మాత్రం డేటా ఖర్చు కాకుండా కావాల్సినన్ని సినిమాలను నచ్చిన క్వాలిటీలో డౌన్ లోడ్ చేసుకోవచ్చని పేర్కొంది. అయితే, ఈ సౌకర్యం ఐడియా వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుంది. ఈ యాప్ తో ఒకేసారి రెండు వీడియోలను కూడా చూడవచ్చని ఐడియా పేర్కొంది. కాగా, ఈ యాప్ ప్రాచుర్యంలోకి వచ్చిన తరువాత కొంత చార్జీలను విధించవచ్చని తెలుస్తోంది. అయితే ఈ యాప్ ప్రస్తుతం బీటా వెర్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉంది.