మీటూ కేసులో మలయాళ నటుడు అరెస్ట్‌

3
- Advertisement -

లైంగిక వేధింపుల ఆరోపణలతో మలయాళ ఇండస్ట్రీ అతలాకుతలం అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మలయాళ చిత్ర పరిశ్రమలో జరుగుతున్న వేధింపులపై కేర‌ళ ప్రభుత్వం జస్టిస్‌ హేమ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో అత్యాచారం కేసులో మలయాళ నటుడు, అమ్మ మాజీ ప్రధాన కార్యదర్శి ఇడవేల బాబును ప్రత్యేక దర్యాప్తు బృందం అరెస్ట్‌ చేసింది.ఇడవేల తనపై అత్యాచారం చేశాడంటూ ఆరోపించింది. అమ్మ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సమయంలో సభ్యత్వం కోసం కలూర్‌లోని ఆయన నివాసానికి వెళ్లగా తనపై అత్యాచారానికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొంది.

అయితే ఆయనపై దాఖలైన కేసులో ఎర్నాకుళం జిల్లా సెషన్స్‌ జడ్జి ఈ నెల 5న బెయిల్‌ మంజూరు చేశారు.

Also Read:KTR : దేవర ప్రీ రిలీజ్ రద్దుపై కేటీఆర్

- Advertisement -